Begin typing your search above and press return to search.

కాజల్.. ఈ వయసులో అలాంటి రొమాన్సా..?

By:  Tupaki Desk   |   14 Aug 2016 6:28 AM GMT
కాజల్.. ఈ వయసులో అలాంటి రొమాన్సా..?
X
ఇటు తెలుగు.. అటు తమిళం.. మరోవైపు హిందీ.. మూడు భాషల్లోనూ తన హవా సాగించింది కాజల్ అగర్వాల్. కానీ ఈ మధ్య ఆమెకు ఎక్కడా కాలం కలిసి రావడం లేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం ఆమెను గట్టి దెబ్బ కొట్టాయి. హిందీలో.. తమిళంలో కూడా ఆమెకు ఫ్లాపులే ఎదురయ్యాయి. తెలుగులో పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉండగా.. హిందీలో ఆమె కెరీర్ కు దాదాపుగా తెరపడింది. ఉన్నంతలో తమిళంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. అజిత్ లాంటి సూపర్ స్టార్ సరసన ఆమెకు అవకాశం దక్కింది. జీవాతో కూడా ఓ సినిమా చేస్తోంది.

జీవా-కాజల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘కవలై వేండాం’ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం విశేషం. నిజానికి వీళ్లిద్దరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాను ఊహించలేం. జీవా వరుసగా అరడజనుకు పైగా ఫ్లాపులు తిని ఉన్నాడు. ఆ ఫ్లాపుల తాలూకు నెగెటివిటీ అంతా అతడి నటనలో కనిపిస్తోంది. మరోవైపు ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించే వయసు కాజల్ కు ఇప్పుడు లేదు. ఇలాంటి లవ్ స్టోరీలకు ఫ్రెష్ బ్యూటీ అయితే బాగుంటుంది. ఐతే దర్శకుడు డీకే మాత్రం అలా ఆలోచించకుండా జీవా-కాజల్ కాంబినేషన్లో ఈ ఫ్రెష్ బ్రీజీ లవ్ స్టోరీ తీయాలనుకున్నాడు. ‘కవలై వేండాం’ టీజర్ నిన్ననే రిలీజైంది. చూడ్డానికి బాగానే అనిపిస్తోంది. కాజల్ ఒకప్పటి స్థాయిలో కాకపోయినా.. ఈ మధ్య వచ్చిన సినిమాలతో పోలిస్తే బెటర్ గానే అనిపిస్తోంది. ఈ చిత్రం కాజల్ బికినీ కూడా వేయడం విశేషం. సెప్టెంబర్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. తమిళంలో బాగా ఆడితే తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.