Begin typing your search above and press return to search.

కవచం రిలీజ్ డేట్ ఫిక్స్.. టెస్ట్ తప్పదా?

By:  Tupaki Desk   |   16 Nov 2018 10:01 AM GMT
కవచం రిలీజ్ డేట్ ఫిక్స్.. టెస్ట్ తప్పదా?
X
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మామిళ్ళ డైరెక్షన్లో తెరకెక్కిన 'కవచం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ హీరో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్.. టీజర్లక మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిలిం మేకర్స్ ప్రకటించారు.

డిసెంబర్ 7వ తారీఖున 'కవచం' రిలీజ్ కానుంది. సరిగ్గా ఆ రోజే తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరగుతాయని ఇప్పటికే ఎన్నికల కమీషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ డే శుక్రవారం నాడు తెలంగాణాలో శెలవు ఉంటుంది. మరి ఈ హాలిడే 'కవచం' కలెక్షన్స్ పెరిగేందుకు ఉపయోగపడుతుందా.. లేదా ఎన్నికల హాడావుడిలో ఈ సినిమాను మొదటిరోజు లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు లేవు కాబట్టి అలాంటి సమస్యేమీ లేదు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముకేష్.. హర్షవర్ధన్ రాణే లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయట. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.