Begin typing your search above and press return to search.

ఇక మిగిలింది ఎఫ్ 2 ఒక్కటే!

By:  Tupaki Desk   |   8 Dec 2018 12:31 PM IST
ఇక మిగిలింది ఎఫ్ 2 ఒక్కటే!
X
బ్యాడ్ లక్ అంటూ ఒక సారి మనకు స్టార్ట్ అయిందంటే సింపుల్ గా అలా వదిలిపెట్టదు. విసిగించి... వేధించి న్యూమరాలజీ నుంచీ వాస్తు దాకా అన్నీ నమ్మేలా చేస్తుంది. మనకే కాదు సెలెబ్రిటీల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు బ్యూటీఫుల్ మెహ్రీన్ అదే సిట్యుయేషన్లో ఉంది. అంటే న్యూమరాలజీ నమ్ముతోందని కాదు.. బ్యాడ్ లక్కు తనను లక్క లాగా అంటుకుందని.

'కేరాఫ్ సూర్య'.. 'జవాన్'.. 'పంతం'.. 'నోటా'. ఇది లిస్టు. ఇప్పటివరకూ నాలుగు వరస ఫ్లాపులు. తాజా గా 'కవచం' రిలీజ్ అయింది. ఫలితం అందరికీ తెలిసిందే. దీంతో పాంచ్ పటాకా. ఫ్లాపు మెహ్రీన్ కేనా.. బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ కు లేదా అంటే.. వాళ్ళకీ ఉంది గానీ చేతిలో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మెహ్రీన్ కు మాత్రం ఈ సినిమా తర్వాత ఒక్కటే మిగిలింది. అదే 'F2'. ఇక ఆశలన్నీ ఆ సినిమాపైనే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ - వెంకటేష్ మల్టిస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే తన కెరీర్ ఏమౌతుందో అని ఇప్పుడు తనకు టెన్షన్ గా ఉందట. హీరోలకు ఫ్లాపులు తగిలినా ఏదో అవకాశాలు వస్తుంటాయి గానీ హీరోయిన్లకు వరస ఫ్లాపులు తగిలితే ఐరన్ లెగ్గనే స్టాంప్ వేస్తారు. అందుకే మెహ్రీన్ తన కెరీర్ విషయంలో ఆందోళనగా ఉందట.