Begin typing your search above and press return to search.

బయటకు వచ్చాక కూడా అమిత్‌ సేఫ్‌ గేమ్‌!

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:38 AM GMT
బయటకు వచ్చాక కూడా అమిత్‌ సేఫ్‌ గేమ్‌!
X
తెలుగు బిగ్‌ బాస్‌ నుండి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా పలు న్యూస్‌ ఛానెల్స్‌ - యూట్యూబ్‌ ఛానెల్స్‌ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఎలిమినేట్‌ అయ్యి బయటకు రావడమే ఆలస్యం వెంటనే స్టూడియోల చుట్టు మాజీ పార్టిసిపెంట్స్‌ తిరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మొదటి సీజన్‌ నుండి ఇది కొనసాగుతుంది. తాజాగా రెండవ సీజన్‌ నుండి అమిత్‌ ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. చిన్న చిన్న విలన్‌ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్న అమిత్‌ ఆ గుర్తింపును బిగ్‌ బాస్‌ దయతో రెట్టింపు చేసుకోగలిగాడు.

సినిమాల్లో విలన్‌ వేశాలు వేసిన అమిత్‌ బిగ్‌ బాస్‌లో మాత్రం కమెడియన్‌ గా మారిపోయాడు. మొదట అమిత్‌ అమాయకత్వపు ముసుగు వేసుకుని ఆట ఆడుతున్నట్లుగా అంతా భావించారు. కాని అతడి నిజ స్వరూపమే అది అని ఆ తర్వాత తేలిపోయింది. ఇంట్లో అందరి కంటే ఎక్కువగా సేమ్‌ గేమ్‌ ఆడుతున్నాడు అంటూ విమర్శలు పొందిన అమిత్‌ - ఆ సేఫ్‌ గేమ్‌ కారణంగానే ఇన్నాళ్లు ఇంట్లో కొనసాగాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో సేఫ్‌ గేమ్‌ ఆడి - ఎలిమినేషన్స్‌ నామినేషన్స్‌ ను ఎక్కువ సార్లు తప్పించుకున్న అమిత్‌ బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నట్లుగా అనిపిస్తుందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

అమిత్‌ ఎలిమినేట్‌ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో ప్రతి సారి కూడా కౌశల్‌ కు జై కొట్టాడు. కౌశల్‌ అభిమానులను - కౌశల్‌ ఆట తీరును ప్రశంసించాడు. ఒక ఇంటర్వ్యూలో కౌశల్‌ కు సెల్యూట్‌ కూడా చేశాడు. ప్రస్తుతం కౌశల్‌ కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో వారిని మచ్చిక చేసుకునేందుకు అమిత్‌ ఇలా సేఫ్‌ గేమ్‌ ఆడినట్లుగా - సేఫ్‌ సైడ్‌ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అమిత్‌ ఏ విషయంలో కూడా నెగటివ్‌ కామెంట్స్‌ చేయకుండా అన్ని విషయాలపై కూడా పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవ్వడం జరుగుతుంది. అమిత్‌ ఏ ఒక్కరిని నొప్పించకుండా - అందరితో సన్నిహితంగా ఉండి ఆఫర్లు దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇలా పాజిటివ్‌ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ సోషల్‌ మీడియా టాక్‌.