Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లో వీడిన స‌స్పెన్స్!

By:  Tupaki Desk   |   26 Aug 2018 9:24 AM GMT
బిగ్ బాస్ లో వీడిన స‌స్పెన్స్!
X
బిగ్ బాస్ -2 లో పాల్గొన‌క ముందు కౌశ‌ల్ గురించి సినీ ప్రేమికుల‌లో కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. అయితే, షోలో పాల్గొన్న త‌ర్వాత కౌశ‌ల్ కు ఏకంగా ఓ ఫ్యాన్స్ ఆర్మీనే త‌యారైంది. అంతేకాదు, కౌశ‌ల్ కు వ్య‌తిరేకంగా మాట్లాడిన కంటెస్టెంట్లంద‌రూ దాదాపుగా ఎలిమినేట్ అయ్యారు. దీనిని బ‌ట్టి కౌశ‌ల్ కు బ‌య‌ట ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, త‌న‌కు ఇంత ఫాలోయింగ్ ఉంద‌న్న సంగ‌తి కౌశ‌ల్ కు తెలియ‌దు. శ‌నివారం షోలో హ‌ఠాత్తుగా ఆ విష‌యాన్ని ఓ కాల‌ర్ రివీల్ చేయ‌డంతో కౌశ‌ల్ కూడా షాక‌య్యాడు. త‌న‌కు ఇంత‌మంది స‌పోర్ట్ ఉంద‌ని తెలిసిన వెంట‌నే కౌశ‌ల్ ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. కౌశ‌ల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను బ‌ట్టి దాదాపుగా అత‌డే విన్న‌ర్ అవుతాడేమోన‌ని మిగ‌తా కంటెస్టెంట్ల‌కూ నిన్నటి నుంచి కొత్త భ‌యంప‌ట్టుకున్న‌ట్ల‌యింది.

అయితే, హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు ....కౌశ‌ల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఆల్రెడీ లీకులిచ్చారు. కానీ, నిన్న‌టి ఎపిసోడ్ లో మాత్రం కౌశ‌ల్ సీక్రెట్ అంద‌రికీ ఓపెన్ గా తెలిసిపోయింది. ఆ కాల్ త‌ర్వాత మిగతా హౌస్ మేట్లంతా డ‌ల్ అయిన‌ట్లు క‌నిపించింది. కౌశ‌ల్ అన్నా అంటూ ఆ కాల‌ర్ సంబోధించ‌డంతో కౌశ‌ల్ ఎమోష‌న్ అయ్యాడు. కౌశ‌ల్ దాదాపుగా గెలుస్తాడ‌న్నంత‌గా ఆ కాల‌ర్ మాట్లాడేస‌రికి....మిగ‌తావారు కొద్దిగా ఇబ్బంది ఫీల‌య్యారు. ఇక ఇప్పటికే కౌశ‌ల్ ను త‌క్కువ అంచ‌నా వేసిన తేజ‌స్వి, బాబు గోగినేని, కిరీటిలు మూల్యం చెల్లించుకున్నారు. కాబ‌ట్టి, ఇక‌పై మిగ‌తా హౌస్ మేట్స్ ...ఫైన‌ల్ రేసులో నిలిచేందుకు మ‌రింత జాగ్ర‌త్తగా ఉండక త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చిందని చెప్ప‌వ‌చ్చు. అయితే, కౌశ‌ల్ విన్ అవుతాడ‌ని ఇప్పుడే క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి...ఎందుకంటే...నాని చెప్పిన‌ట్లు `ఈ సారి బిగ్ బాస్ లో ఏమైనా జ‌రగ‌వ‌చ్చు`....లెట్స్ వెయిట్ అండ్ సీ.