Begin typing your search above and press return to search.

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. బిగ్ బాస్ స్ట్రిక్ట్ రూల్..

By:  Tupaki Desk   |   28 July 2019 8:29 AM GMT
కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. బిగ్ బాస్ స్ట్రిక్ట్ రూల్..
X
కౌశల్ ఆర్మీ.. పోయిన బిగ్ బాస్ రెండో సీజన్ ను గుప్పిటపట్టి మొత్తం బిగ్ బాస్ ను నియంత్రించి ఎవరిని ఎలిమినేట్ చేయాలో నిర్ణయించేంత గట్టిగా తయారైన సోషల్ మీడియా గ్రూపు. ఎంతలా అంటే కౌశల్ ను గద్దించిన పాపానికి హోస్ట్ నానిని కూడా వీళ్లు ట్రోల్ చేశారనే ప్రచారం జరిగింది. కౌశల్ ను దేవుడిగా మార్చి హౌస్ లో ఆయనను ఎదురించిన వాళ్లందరినీ వారం వారం ఓట్లు తక్కువగా వేసి బయటకు పంపించారనే అనుమానాలు వెల్లువెత్తాయి.

అయితే దీనివెనుక కౌశల్ ఎత్తులు ఉన్నాయన్న ప్రచారం సాగింది. గూగుల్ లో ఓట్లు వేసే పద్ధతిని కౌశల్ క్యాష్ చేసుకొని కొన్సి కన్సల్టెంట్ల ద్వారా పెద్ద ఎత్తున ఓట్లు రాల్చుకున్నాడనే ఆయన బయటకు వచ్చాక పలు మీడియా సంస్థలు తేల్చి ఆరోపణలు చేశాయి. కొందరు ఆయన అనుచరులు మీడియాకెక్కి ఇదే విషయం చెప్పుకొచ్చారు..

ఏది ఏమైనా హౌస్ లోని కంటెస్టెంట్లను నియంత్రించే అధికారం బిగ్ బాస్ కే ఉంటుంది. కానీ పోయినసారి మాత్రం కౌశల్ కు, కౌశల్ ఆర్మీకి ఆ నియంత్రణ పోయిందన్న అపవాదు వచ్చింది. దీంతో ఈసారి ఎలాంటి ఆర్మీలకు తావులేకుండా బిగ్ బాస్ టీం పారదర్శకంగా.. పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం వారు ఓటింగ్ సిస్టంనే పూర్తిగా సమూళంగా మార్చివేయడం గమనార్హం..

ఇక నుంచి గూగుల్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లకు ఓట్లు వేయడానికి ఆప్షన్ ఉండదు. పోయినసారి గూగుల్ లో 50 ఓట్లు చొప్పున వేసేవారు. ఇప్పుడు అది తీసేసి కేవలం హాట్ స్టార్ యాప్ లోనే 10 ఓట్లు మాత్రమే వేసేలా పద్ధతి మార్చేశారు. ఒక కాలింగ్ సిస్టమ్ లో కూడా 40 కాల్స్ కే తగ్గించారు. హాట్ స్టార్ ద్వారా ఓటింగ్ సిస్టం కావడం.. ఒక వ్యక్తి ఫోన్ నుంచి 10ఓట్లు మత్రమే కావడంతో జెన్యూన్ గా ఆట సాగనుందని సమాచారం. గూగుల్ ద్వారా మేనిక్యులేషన్ జరగడంతో ఇప్పుడు స్టార్ మా తన సొంత హాట్ స్టార్ యాప్ తో జెన్యూన్ ఓటింగ్ కు శ్రీకారం చుట్టింది. అందుకే తొలి వారమే ఖచ్చితమైన ఓటింగ్ జరిగి హిమజ, పునర్నవిలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. మరి ఈ ఆదివారం ఓటింగ్ ద్వారా ఎవరు బయటకు వెళుతారోనన్న ఆసక్తి నెలకొంది.