Begin typing your search above and press return to search.

#RED థీమ్ .. అదేక‌దా RR మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ స్పెషాలిటీ

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:54 PM IST
#RED థీమ్ .. అదేక‌దా RR మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ స్పెషాలిటీ
X
ఇస్మార్ట్ శంక‌ర్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాక రాపో (రామ్ పోతినేని) మాంచి జోరుమీదున్నాడు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత అత‌డు న‌టిస్తున్న తాజా మూవీ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాళ‌విక శ‌ర్మ‌- నివేదా పేతురాజ్ నాయిక‌లు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్న ఈ మూవీ త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా తెర‌కెక్కుతోంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని `కౌన్ హే అచ్చా కౌ హే లుచ్చా` సాంగ్ ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు.

యూట్యూబ్ ‌లో ఈ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో జోరు మీద ఉంది. ఈ పాటపై స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ట్వీట్ చేసి అభినందించారు. థీమ్ అదిరింది అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం స్పందించింది. ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌ మాట్లాడుతూ `సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చే సాంగ్ ఇది. ఈ పాట‌ని క‌ల్యాణ్ చక్ర‌వ‌ర్తి ప‌ర్ ఫెక్ట్ ‌గా రాశారు. మ‌ణిశ‌ర్మ బాణీల‌కు అనురాగ్ కుల‌క‌ర్ణి గానం అద‌న‌పు ఆక‌ర్ణ‌ణ అయింది` అన్నారు.

``రెడ్‌` నుంచి ఏ పాట విడుద‌లైనా ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ గారి బాణీల‌కు ఎంత గొప్ప‌ ఆద‌ర‌ణ వుంటుందో మ‌రో సారి ఈ పాట ద్వారా నిరూపిత‌మైంది. సంక్రాంతికి సినిమాని విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాం` అని నిర్మాత‌ అన్నారు. ఇందులో రామ్ డ్యుయ‌ల్ రోల్ ‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.