Begin typing your search above and press return to search.

ఆ సింగ‌ర్‌ కు 10 కోట్ల‌మంది ఫాలోయ‌ర్లు

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:57 AM GMT
ఆ సింగ‌ర్‌ కు 10 కోట్ల‌మంది ఫాలోయ‌ర్లు
X
ప్ర‌పంచంలో చాలామంది ప్ర‌ముఖులు ఉన్నారు. శ‌క్తివంతులైన నేత‌లు ఉన్నారు. ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన వారూ ఉన్నారు.కానీ.. వారెవ‌రూ సాధించ‌లేని రికార్డును ఒక లేడీ సెల‌బ్రిటీ క్రియేట్ చేశారు. సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా ఉండే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌ లో తొలిసారి బిలియ‌న్ మార్క్‌ ను ట‌చ్ చేసిందో సెల‌బ్రిటీ. హాలీవుడ్ సంచ‌ల‌నం.. ప్ర‌ఖ్యాత సింగ‌ర్ కేటి పెర్రీ ప‌ది కోట్ల మార్క్‌కు చేరుకొని రికార్డు సృష్టించింది.

పెర్రీ ట్విట్ట‌ర్ ఫాలోయ‌ర్ల సంఖ్య 10 కోట్ల‌కు చేరుకుంది. ట్విట్ట‌ర్‌ లో ఇంతమంది ఫాలోయ‌ర్ల‌ను సొంతం చేసుకున్న తొలి యూజ‌ర్ గా ఆమె రికార్డు సృష్టించారు.

అభిమానుల వ‌ల్లే తానీ అరుదైన రికార్డును సొంతం చేసుకోగ‌లిగాన‌ని కేటి పెర్రీ పేర్కొంది. ట్విట్ట‌ర్ టాప్ యూజ‌ర్లలో కేటి అగ్ర‌స్థానం ల‌భించ‌న‌గా..త‌ర్వాతి స్థానాల్లో 97 మిలియ‌న్ల‌తో పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్‌.. 85 మిలిచ‌ప‌క‌ల ఫాలోయ‌ర్ల‌తో మ‌రో పాప్ సంచ‌ల‌నం టేల‌ర్ స్విప్ట్ త‌ర్వాతి స్థానాల్లో నిల‌వ‌టం గ‌మ‌నార్హం. 96 అవ‌ర్‌.. బిగ్ బ్ర‌ద‌ర్ లాంటి కార్య‌క్ర‌మాల‌తో 190 దేశాల్లో అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌టంతోపాటు.. ఫాలోయ‌ర్ల సంఖ్య‌ను అమాంతం పెంచుకుంది.
ట్విట్ట‌ర్‌ లో భారీగా ఫాలోయ‌ర్లు ఉన్న నేప‌థ్యంలో గ‌తంలో కేటి పెర్రీ ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక‌ర్లు హ్యాక్ చేసి.. ఆమె ఖాతాలో అశ్లీల సందేశాలు.. ఫోటోల్ని పోస్ట్ చేశారు. ఆ ఉదంతం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. తాజాగా పెర్రీ త‌న కొత్త ఆల్బ‌మ్‌తో బిజీబిజీగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/