Begin typing your search above and press return to search.

ఇలియానాని కాపీ కొడుతున్న కత్రినా

By:  Tupaki Desk   |   8 Feb 2017 5:19 AM GMT
ఇలియానాని కాపీ కొడుతున్న కత్రినా
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. కొన్నేళ్ల క్రితం నుంచి హిందీ సినిమా ఫీల్డ్ ను ఏలేస్తోంది. చేతిలో హిట్స్ ఉన్నా ఇంకా స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు తంటాలు పడుతోంది ఇలియానా. మరి ఇల్లీ బేబీని కేట్ కాపీ కొట్టడం ఏంటా అనిపించక మానదు. కానీ.. రీసెంట్ గా కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే మాత్రం ఇదే అనిపిస్తుంది.

అండర్ వాటర్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంలో ఇలియానా ఆరితేరిపోయింది. ఫోటోగ్రాఫర్ కూడా తన లవర్ అండ్రూ నీబోన్ కావడంతో.. ఇలియానా ఇలాంటి ఫోటోల విషయంలో తెగ రెచ్చిపోతూ ఉంటుంది. నీటి అడుగున బికినీ అందాలను ఫోటోల రూపంలో.. వీడియోల రూపంలో కూడా షేర్ చేసి కనువిందు చేసింది ఇలియానా. ఇప్పుడు ఇదే టైపు ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టించి కత్రినా కైఫ్. టూపీస్ బికినీలో కేట్ అందాలు కనుల విందు చేసేస్తున్నాయి.

అది కూడా స్కిన్ కలర్ బికినీ వేయడంతో.. ఈ పిక్చర్ మరింత ఆకర్షణీయంగా మారిపోయింది. పైగా ఒంటిమీద స్విమ్ సూట్ తప్ప మరేమీ ధరించకపోవడం.. ఈ ఫోటోకు మరో ఆకర్షణగా చెప్పచ్చు. కాపీ సంగతేమో కానీ.. కత్రినా షేర్ చేసిన కొత్త ఫోటో మాత్రం అభిమానులకు తెగ హుషారు తెప్పించేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/