Begin typing your search above and press return to search.

క్యారెట్ పండించిన హాట్ హీరోయిన్

By:  Tupaki Desk   |   5 July 2017 10:21 AM GMT
క్యారెట్ పండించిన హాట్ హీరోయిన్
X
బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ అభిమానులందరికీ కొత్త సందేశం ఇస్తోంది. షూటింగ్ షెడ్యూళ్లు ప్రమోషన్లతో ఎప్పుడూ బిజీ ఉండే ఈ భామ ఇటీవల హౌస్ గార్డెనింగ్ పై ఆసక్తి పెరిగింది. తన ఇంటి బాల్కనీలో ఉన్న కొద్దిపాటి స్థలంలో చిన్న గార్డెన్ పెంచింది. వాటిలో కూరగాయల మొక్కలను పెంచి వాటిని సంరక్షించింది.

కత్రినా హోం గార్డెన్ లో పెంచిన క్యారెట్ ఇటీవల కాపుకొచ్చింది. దీంతో ఆమె తాను పండించిన క్యారెట్ దుంపలను చూపిస్తూ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి మాంచి క్యాప్షన్ కూడా జోడించింది. మీ సొంత క్యారెట్లను మీరే పెంచుకోవచ్చు అని ఓ సలహా ఇచ్చేసింది. కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో కొద్ది నెలల క్రితమే చేరింది. అప్పటి నుంచి తన లైఫ్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ కు సంబంధించి ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటోంది. రీసెంట్ గా తాను సొంతగా పండించిన క్యారెట్ దుంపలతో ఆమె షేర్ చేసిన ఫొటోకు మంచి ప్రశంసలే దక్కుతున్నాయి.

మొక్కలను పెంచండి.. పర్యావరణాన్ని రక్షించండి.. రసాయన ఎరువులు లేని ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించండి అంటూ సినిమా హీరోయిన్లు సలహాలు ఇవ్వడం తప్ప ఆచరించేది తక్కువే. బిజీ హీరోయిన్ అయినా కత్రినా మాటలతో సరిపెట్టకుండా మొక్కల పెంపకానికి కాస్త టైం కేటాయించి శభాష్ అనిపించుకుంటోంది.