Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఆమెకు క్యాజువల్ కానీ మనకు స్టన్నింగ్!

By:  Tupaki Desk   |   7 Sep 2019 4:25 AM GMT
ఫోటో స్టొరీ: ఆమెకు క్యాజువల్ కానీ మనకు స్టన్నింగ్!
X
న్యూ జెనరేషన్ బ్యూటీలు ఇండస్ట్రీలోకి వెల్లువలా వస్తుంటే.. ప్రేక్షకుల అభిరుచులు పాదరసంలా మారిపోతుంటే ఒక హీరోయిన్ తన కెరీర్ ను ఎక్కువ కాలం కొనసాగించడం ఎంత కష్టమనేది ఎవరికైనా అర్థం అవుతుంది. వీటన్నిటికీ తోడు.. ఇండియాలో ఉండే ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా హీరో సెంట్రిక్. అంటే హీరో చుట్టూ హచ్చి కుక్కలా తిరిగేదే. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇలాంటి ఇండస్ట్రీలో ఒక పదిహేనేళ్ళు హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడం అంటే అది డౌట్ లేకుండా కత్తిమీద సాము చేయడం అనే చెప్పాలి. అలాంటి ఫీట్ సాధించిన భామలు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి అందాలరాశుల్లో కత్రీనా కైఫ్ ఒకరు.

అడమరమనిషి.. అదే లేడీ రోబో.. హావభావాలు పలకవు అనే స్థాయి నుంచి మంచి నటి.. బెస్ట్ డ్యాన్సర్ అనిపించుకునేవరకూ క్యాట్ పయనం సాగింది. ఇక సల్మాన్ భాయిజాన్ కు ఉన్న పదహారువేల మంది ప్రియురాళ్ళలో ఈ భామ టాప్ ఫైవ్ లోనే ఉంటుంది. అదేమీ సాధారణ విషయం కాదు. రీసెంట్ గా ఐఫా కార్యక్రమంలో పాల్గొన్నన ఈ భామ 'సల్మాన్ నాకు లైఫ్ టైమ్ ఫ్రెండ్' అని శెలవిచ్చింది. తాజాగా ఈ భామ ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు సింగపూర్ కు పయనమవుతూ ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా కత్రినా ఫోటోలను క్లిక్కుమనిపించారు సదరు బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు.

ఈ ఫోటోలను చూస్తే కత్రినా స్టైల్ ఏ రేంజ్ లో ఉందో మనకు మరోసారి అర్థం అవుతుంది. గ్రే కలర్ టాప్.. దానిపైన మల్టి కలర్స్ ఉండే జాకెట్ ధరించి దానికి మ్యాచింగ్ గా కార్గో టైప్ లో కనిపించే లైట్ కలర్ ప్యాంట్ ధరించింది. లూజ్ హెయిర్ తో క్యాజువల్ గా కనిపిస్తూనే కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టైల్ ను రంగరించింది. వీటికి తోడు హై హీల్స్ ధరించి ఒక హాలీవుడ్ హీరోయిన్ తరహాలో ఎంచక్కా నడుచుకుంటూ పోయింది. తెలుగులో బ్లడ్డు.. బ్రీడు అని ఒక అన్-పాపులర్ డైలాగ్ ఉంది. సపోజ్.. పర్ సపోజ్ అది నిజమేనని ఒక్క క్షణం అనుకుంటే ఈ కత్రినా ఒక స్పెషల్ బ్లడ్ లైన్.. అంతకంటే స్పెషల్ బ్రీడ్ కు చెందిన భామ. ఇంతకంటే ఈ బాలీవుడ్ రతీదేవి గురించి ఏం చెప్పలేం. ఇక ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. భాయిజాన్ పెళ్ళి చేసుకునే వరకూ ఈమె కూడా అలానే ఒంటరిగా ఉండేలా ఉంది... కొంపదీసి కఠోరమైన.. కర్కోటకమైన సల్మాన్ భాయిజాన్ మనసు పెళ్ళి విషయంలో కరిగేవరకూ వేచి చూస్తోందా ఏంటి?