Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టులోనూ కత్తి దూసేసింది

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:50 AM IST
ఎయిర్ పోర్టులోనూ కత్తి దూసేసింది
X
లుక్స్.. గెటప్స్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బాగా అడ్వాన్సెడ్ గా ఉంటుంది. ఏ టైమ్ లో చూసినా సరే మిలమిలా మెరిసిపోయే అందం ఈమె సొంతం. రీసెంట్ గా డ్రీమ్ టీమ్ పేరుతో పలువురు బాలీవుడ్ తారలతో కలిసి యూఎస్ లో చక్కర్లు కొట్టింది కత్రినా. తన అనేక పాటలకు చిందులు వేసి.. అక్కడి జనాలను బాగా ఎంటర్టెయిన్ చేశాక.. తాజాగా ముంబైలో అడుగు పెట్టింది.

లాంగ్ టూర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడకు వచ్చీ రావడంతోనే.. ఎయిర్ పోర్టులో ఆమెకు ఫోటోగ్రాఫర్లు స్వాగతం పలికారు. తను ఎక్కువ మేకప్ లో లేదని కానీ.. బాగా అలసిపోయానని కానీ చెప్పకుండా.. ఫోటో సెషన్ ను తప్పించుకోకుండా.. అడిగినోళ్లకు అడిగినన్ని పోజులిచ్చి అలరించింది ఈ కత్తి. డెనిమ్ షార్ట్స్.. వైట్ కలర్ ట్యాంక్ టాప్ వేసుకుని.. చెక్స్ లాంగ్ కార్డిగాన్ లో భలేగా మెరిసింది లెండి.

ఏ టైమ్ లో ఫోటోలకు ఏ రేంజ్ లో ఎలాంటి పోజులివ్వాలో ఫోటోగ్రాఫర్లకు కూడా నేర్పించేసే టైపులో కనిపించేసింది కత్రినా. ఇక బార్ బార్ దేఖో మూవీతో త్వరలో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అందులో ఈ భామ చిందులేసిన కాలా చెష్మా పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది. అన్నట్లు ఓ విషయం చెప్పుకోవాలి. డ్రీమ్ టీమ్ టూర్ లో భాగంగా.. కాలా చెష్మానే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.