Begin typing your search above and press return to search.

కత్రినా.. ఏం కష్టం వచ్చిందమ్మా?

By:  Tupaki Desk   |   28 Oct 2015 4:01 PM IST
కత్రినా.. ఏం కష్టం వచ్చిందమ్మా?
X
రణబీర్ తో పెళ్లి కాలేదన్న ఫ్రస్టేషన్ వల్లో లేక ఇంకేదైనా కారణముందో కానీ.. కత్రినా కైఫ్ ఏడ్చేసింది. అది కూడా పబ్లిగ్గా... ఓ చర్చిలో మేరీ మాత ముందు బోరున ఏడ్చసిందట లండన్ బ్యూటీ. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని చర్చిలో కత్రినా ఇలా కన్నీరు పెట్టేసుకున్నట్లు ముంబయి మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ ఫొటోగ్రాఫర్ ఆమె ఏడుస్తున్న ఫొటోలు కూడా తీశాడట. ఐతే కత్రిన ఆ సంగతి గమనించి.. దయచేసి ఫొటోలు మీడియాలో పబ్లిష్ చేయొద్దని ప్రాధేయ పడటంతో అతను ఆమె మాట మన్నించాడట. ఐతే వార్త మాత్రం మీడియాకు పొక్కిపోయింది.

ముందు సల్మాన్ తో ప్రేమాయణం నడిపి.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో అతడి నుంచి విడిపోయిన కత్రినా దాదాపు మూడేళ్లుగా రణబీర్ తో డీప్ లవ్ లో ఉంది. వీళ్లిద్దరి పెళ్లి గురించి రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య అయితే ఇదిగో ఎంగేజ్ మెంట్, అదిగో పెళ్లి అన్నట్లు రూమర్లు వినిపించాయి. కానీ కొన్నాళ్లకే వేడి చల్లారిపోయింది. కత్రినా పెళ్లికి రెడీగా ఉన్నప్పటికీ.. రణబీరే ఆ సంగతి తేల్చట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రస్టేట్ అయిపోయి ఆవేదనతో కత్రినా ఏడ్చేసిందేమో అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.