Begin typing your search above and press return to search.

కత్తిలాంటి చెల్లికి హీరో దొరికేశాడు

By:  Tupaki Desk   |   30 March 2018 5:30 PM GMT
కత్తిలాంటి చెల్లికి హీరో దొరికేశాడు
X
ఫిలిం ఇండస్ట్రీలో ఒకసారి సెట్ కావడమే చాలా కష్టమైన విషయం. ఫ్యామిలీలో ఒక్కరు కనుక సెటిల్ అవగలిగితే.. ఇక వాళ్ల పేరు చెప్పుకుని ఎంతమంది అయినా వచ్చేయచ్చు. అఫ్ కోర్స్.. ఇదంతా ఫస్ట్ ఆఫర్ కి మాత్రమే పరిమితం. మొదటి సినిమా తర్వాత రెండో మూవీ రావాలంటే మాత్రం ట్యాలెంట్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే.

దేశం మొత్తం జనాలతో కత్తి లాంటి బ్యూటీ అనిపించుకున్న కత్రినా కైఫ్.. ఇప్పుడు తన చెల్లెలు ఇసాబెల్లె కైఫ్ ను కూడా బాలీవుడ్ లోకి దించేస్తోంది. సోషల్ మీడియా జనాలకు బాగానే తెలిసిన ఇసాబెల్లే.. అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. సూరజ్ పంచోలి హీరోగా.. స్టాన్లే డి'కోస్టా దర్శకత్వంలో రూపొందుతున్న టైం టు డ్యాన్స్ మూవీ ద్వారా కత్రినా చెల్లెలు హీరోయిన్ గా పరిచయం కానుంది. ఏడాదికి పైగా ఈ ప్రాజెక్టు గురించి వార్తలు వస్తుండగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు జరిగిపోతున్నాయి.

టైం టు డ్యాన్స్ అనే టైటిల్ కి తగినట్లుగానే.. ఈ చిత్రం అంతా డ్యాన్స్ థీమ్ తో సాగుతుందట. అందుకే గత కొన్ని వారాలుగా ఈ చిత్రం కోసం తెగ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట సూరజ్ అండ్ ఇసాబెల్లే. తన తొలి హిందీ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండడంపై తెగ సంతోషంగా ఉంది. ఇప్పటికే సమ్మమ్ బోనమ్.. డాక్టర్ క్యాబీ.. కమింగ్ హోమ్ వంటి పలు బ్రిటన్ మూవీస్ లో నటించిన ఇసాబెల్లే కైఫ్.. బాలీవుడ్ లో పాగా వేసేయాలని బాగా ఫిక్స్ అయిపోయింది.