Begin typing your search above and press return to search.

క్యూటీతో బ్యూటీ టాయ్ షాపింగ్!!

By:  Tupaki Desk   |   27 Oct 2017 9:53 AM GMT
క్యూటీతో బ్యూటీ టాయ్ షాపింగ్!!
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇన్ స్టాగ్రామ్ లో చేరినప్పటి నుంచి సెన్సేషన్స్ సృష్టిస్తూనే ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఫోటోలను అప్ లోడ్ చేస్తూ.. అభిమానులను అలరిస్తోంది కేట్. తనకు సంబంధించిన మాంచి వీడియోలను ఇంట్రెస్టింగ్ గా అందించడంలో కత్రినా దిట్ట.

ఇప్పుడు ఆమె షేర్ చేయకపోయినా.. కేట్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న టైగర్ జిందాహై చిత్రం కోసం గ్రీస్ లో ఉంది కత్రినా. అక్కడ ఓ సాంగ్ షూట్ జరుగుతుండగా.. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ఓ ముద్దులొలికే చిన్నారిని ఎత్తుకుని కత్రినా కనిపిస్తుంది. ఎయిర్ పోర్ట్ లో ఓ బొమ్మల షాపులో టాయ్స్ షాపింగ్ చేస్తోంది కేట్. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన దర్శకుడు.. ఇద్దరిలో ఎవరు ఎక్కువ క్యూట్ గా ఉన్నారంటూ జనాలు పజిల్ విసిరాడు. దీనికి సమాధానం చెప్పడం కాస్త కష్టమైన విషయమే అని చెప్పాలి.

ఎందుకంటే.. క్యాజువల్ ప్యాంట్.. టీషర్ట్.. జాకెట్ తో కత్రినా లుక్ అదిరిపోయింది. ఆ చిన్నారిని ఎత్తుకున్న తీరు.. షాపింగ్ చేస్తున్న విధానం అదుర్స్ అనాల్సిందే. అసలింతకీ ఈ చిన్నారి పాప ఎవరనే సంగతి చెప్పలేదు కానీ.. బిడ్డను ఎత్తుకున్న కత్రినా వీడియో మాత్రం వైరల్ అయిపోతోంది.