Begin typing your search above and press return to search.

మా ఆవిడ క‌త్తి! విక్కీ -క్యాట్ రేర్ ఫోటో!!

By:  Tupaki Desk   |   13 Dec 2021 4:43 AM GMT
మా ఆవిడ క‌త్తి! విక్కీ -క్యాట్ రేర్ ఫోటో!!
X
కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్ జంట డిసెంబ‌ర్ 9న హిందూ సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. వారి హల్దీ వేడుక నుండి అద్భుతమైన చిత్రాలను షేర్ చేసిన ఈ జంట మెహెందీ నుండి కొన్ని అరుదైన మూవ్ మెంట్స్ ని పంచుకున్నారు. ఈ లుక్ చూడ‌గానే.. పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు.

``మెహందీ తా సజ్దీ జే నాచే సారా తబ్బర్`` అంటూ కత్రినా కైఫ్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. విక్కీ కౌశల్ కూడా అదే క్యాప్షన్ తో వేడుక నుండి ఫోటోల‌ను పంచుకున్నారు. మెహెందీ కోసం గోరింట‌ను రాజస్థాన్ లోని సోజత్ నుండి కొనుగోలు చేశార‌ట‌. ఇది రసాయన రహితమైనది. గోరింటాకు రూ. 50000 నుండి రూ. 1 లక్ష వరకు ఖర్చయింద‌ట‌.

కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ గురువారం సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వివాహం చేసుకున్నారు. ఇంత‌కుముందు క‌త్రినా కైఫ్- విక్కీ కౌశల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజస్థాన్ వెళ్లారు. ఇద్దరు నటులు ముంబై విమానాశ్రయంలో (విడిగా) కెమెరాల‌కు చిక్కారు. వారి చిరునవ్వు అంతా ఓపెన్ చేసేసింది.

మంగళవారం మెహందీ వేడుకతో వీరి వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫెరాలకు ముందు సెహ్రాబందీ వేడుక జరిగింది. బుధవారం సంగీత్‌ కార్యక్రమం జరిగింది. అన్ని వేడుక‌ల నుంచి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ఈ జంట పెళ్లికి ముందు రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఎట్ట‌కేల‌కు ఒక‌ట‌య్యారు. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ రిసార్ట్- ఫోర్ట్ బార్వారా ఈ ఉత్సవాలకు వేదికైంది. నేహా ధూపియా భర్త అంగద్ బేడి- మినీ మాథుర్ -భర్త కబీర్ ఖాన్- మాళవిక మోహనన్- శర్వరీ వాఘ్ వంటి కొద్ది మంది అతిథులను ఈ జంట ఆహ్వానించారు.

అన్న‌ట్టు విక్కీ కౌశ‌ల్ మెహందీ ఫోటోల‌ను ఆవిష్క‌రిస్తూ క‌త్రిన వైపు చూపిస్తున్నారు. మా ఆవిడ కత్రిన కైఫ్ అంటూ ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నాడు! అంటూ అభిమానులు స‌ర‌దా వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు. క‌త్రిన తెలుగులో మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పెళ్లికి విక్ట‌రీ వెంక‌టేష్ ని ఆహ్వానించార‌ని క‌థ‌నాలొచ్చాయి.