Begin typing your search above and press return to search.

క‌త్రినాకు వాన అంటే అంత భ‌య‌మా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:07 AM GMT
క‌త్రినాకు వాన అంటే అంత భ‌య‌మా?
X
కొంద‌రి సెల‌బ్రిటీల ముచ్చ‌ట్లు వింటే.. వామ్మో అనుకోవాల్సిందే. ఎంత సెల‌బ్రిటీ అయితే మాత్రం మ‌రీ ఇంత‌లానా? అన్న భావ‌న కొన్ని సంద‌ర్భాల్ని చూస్తే అనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ భామ‌ల్లో ఒక‌రైన క‌త్రినా కైఫ్ ముచ్చ‌ట హాట్ టాపిక్ గా మారింది. చిన్న చినుకుల‌కే కందిపోతాన‌న్న‌ట్లుగా అమ్మ‌డు ప్ర‌వ‌ర్తించిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి ప్ర‌త్యేక విమానంలో క‌త్రినా జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి వ‌చ్చారు. రాంచీ ఎయిర్ పోర్ట్ లో స్పెష‌ల్ చాప్ట‌ర్ ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి చిన్న‌పాటి జ‌ల్లులు ప‌డుతున్నాయి. అంతే.. విమానం బ‌య‌ట‌కు వ‌స్తే తాను త‌డిచిపోతాన‌న్న ఉద్దేశంతోనే దాదాపు ప‌ది నిమిషాల‌కు పైనే క‌త్రినా విమానంలోనే ఉండిపోయింద‌ట‌.

క‌త్రినా వాన ఇబ్బందిని గుర్తించిన ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ అమ్మ‌డి కోసం ప్ర‌త్యేకంగా గొడుగు తీసుకొచ్చార‌ట‌. తాను త‌డ‌వ‌కుండా ఉండేందుకు తెచ్చిన గొడుగును చూసి.. విమానంలోని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ట ఈ సుకుమారి. ఎయిర్ పోర్ట్ టెర్మిన‌ల్ ద‌గ్గ‌ర క‌త్రినాను చూసేందుకు పెద్ద ఎత్తున యువ‌కులు చేరుకొని సంద‌డి చేశార‌ట‌. క‌త్రినా వ‌స్తుంటే.. ఎయిర్ పోర్ట్ లో భారీగా భ‌ద్ర‌త‌నుఏర్పాటు చేయ‌టం ఉండ‌నే ఉన్నాయ‌నుకోండి. ఎంత సెల‌బ్రిటీ అయితే మాత్రం.. చిన్న వ‌ర్షానికే అంతలా చేయాలా? అన్న విమ‌ర్శ‌ను కొంద‌రు సంధిస్తుంటే.. క‌త్రినాలాంటి సెల‌బ్రిటీలో వాన‌లో ఎందుకు త‌డుస్తారంటూ.. కొంద‌రు అభిమానులు ఆమెకు మ‌ద్ద‌తుగా ప్ర‌శ్నిస్తున్నారు. క‌త్రినా మ‌జాకానా?