Begin typing your search above and press return to search.

అబ్బే మల్లీశ్వరి సర్జరీ చేయించుకోలే

By:  Tupaki Desk   |   19 Jan 2018 7:41 AM GMT
అబ్బే మల్లీశ్వరి సర్జరీ చేయించుకోలే
X
మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్. ఆ సినిమా హిట్ అవ్వగానే అమ్మడు టాలీవుడ్ లో ఎక్కువ కాలం ఉండలేదు. వెంటనే బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇచ్చింది. ఏ మాత్రం తడబడకుండా తన టాలెంట్ ను నిరూపించుకుంది. జయాపజయాలతో సబందం లేకుండా దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించేసింది.

అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా కూడా తన అందంలో ఏ మాత్రం మార్పులు రనివ్వడం లేదు. కానీ ఇటీవల ఆమె మొహం డిఫెరెంట్ గా మారడంతో ఆమె అభిమానులు అందరు షాక్ అయ్యారు. మొహం మొత్తం వాఛినట్లు అనిపించింది. ముక్కు కూడా డిఫెరెంట్ గా అయ్యింది. అలాగే లిప్స్ కూడా ఎప్పుడు చూడని విధంగా ఉండడంతో సర్జరీ ఏమైనా చేయించుకుందా అని రూమర్లు వచ్చాయి. కానీ అసలు మ్యాటర్ అది కాదని తెలిసింది. క్రిస్మస్ కి విడుదలైన టైగర్ జిందా హై సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా షూటింగ్ బిజిలో అమ్మడు తన పన్ను నొప్పి సమస్యను పట్టించుకోలేదట. సమయానికి మెడిసిన్స్ వాడటంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిందట. ఆ తరువాత యాంటీ బయోటిక్ డోస్ ఎక్కువవ్వడంతో కత్రినా కొత్త సమస్యను తెచ్చుకుంది. ప్రస్తుతం డాక్టర్స్ ఆమెకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అందువల్ల కొన్ని రోజులు కోర్స్ పూర్తయ్యే వరకు షూటింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం కత్రినా కైఫ్ అమీర్ ఖాన్ - షారుఖ్ సినిమాల్లో నటిస్తోంది. ఇక టైగర్ జిందా హై సినిమా 300 కోట్ల బాక్స్ ఆఫీస్ ని ఈజీగా దాటేసింది.