Begin typing your search above and press return to search.

ఐశ్యర్య రాయ్.. ఒక నక్క

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:44 PM GMT
ఐశ్యర్య రాయ్.. ఒక నక్క
X
ఒక స్టార్ హీరోయిన్ ను.. అందునా తనకంటే సీనియర్ హీరోయిన్ ను గురించి విమర్శించేందుకు సాహసించేందుకు సహజంగా భామలు ముందుకు రారు. ఎక్కడైనా ఇబ్బందిపడేలా ప్రశ్నలు ఎదురైనా.. నొప్పించక తానొవ్వక అన్నట్లుగా తప్పించుకునే సమాధానమే చెబుతారు. కానీ కత్రినా కైఫ్ మాత్రం ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను గట్టిగానే తిట్టేసింది.

కారణాలేంటో తెలియదు కానీ.. ఐశ్వర్యారాయ్ ను నక్కతో పోల్చింది కత్రినా కైఫ్. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం జగ్గా జాసూస్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు రణబీర్ కపూర్.. కత్రినా కైఫ్. ప్రచారంలో భాగంగా ఇద్దరూ కలిసి.. కేట్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా లైవ్ ఛాట్ లోకి వచ్చారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి బోలెడు జోకులు పేల్చారు కూడా. సెషన్ సమయంలో రణబీర్ ఓ టిపికల్ క్వశ్చన్ అడిగారు. ఒక సెలబ్రిటీనీ ఒక జంతువుతో పోల్చాల్సి ఉంటుందన్న మాట. ఇందులో భాగంగా నక్క అని రణబీర్ అనగానే.. ఏ మాత్రం తడుముకోకుండా ఐశ్వర్యారాయ్ బచ్చన్ అనేసింది కేట్. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐష్‌ అండ్ రణబీర్ రొమాన్స్ మనకు తెలిసిందే. ఆ తరువాత రణబీర్ అండ్ కత్రినా బ్రేకప్ కూడా అయ్యింది. ఏదన్నా లింకుందంటారా?

ఇక జగ్గా జాసూస్ మూవీ చేయడంలో అత్యంత క్లిష్టమైన పార్ట్ ఏదంటే.. 'మూడేళ్లపాటు షూటింగ్ చేయడం.. రిలీజ్ కావడానికి నాలుగేళ్లు పట్టడం' అని రణబీర్ ఆన్సర్ ఇస్తే.. 'నీతో నటించడమే నాకు అత్యంత క్లిష్టమైన విషయంగా అనిపించింది' అంటూ మరో షాక్ ఇచ్చింది బాలీవుడ్ కత్తి లాంటి సుందరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/