Begin typing your search above and press return to search.

తెర‌వెన‌క బంధం లీక్ ఇచ్చిందిగా

By:  Tupaki Desk   |   7 Sept 2019 11:06 AM IST
తెర‌వెన‌క బంధం లీక్ ఇచ్చిందిగా
X
కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ తో క‌త్రిన అనుబంధం ఎలాంటిది? ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌త్యేకించి స‌మాధానం చెప్పాల్సిన ప‌నేలేదు. స‌ల్మాన్ - క‌త్రిన జంట సుదీర్ఘ‌ ప్రేమాయ‌ణం అనంత‌రం బ్రేక‌ప్ గురించి తెలిసిందే. కుర్ర హీరో రణ‌బీర్ క‌పూర్ తో నిండా ప్రేమ‌లో మునిగిన క‌త్రిన‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలింది. ర‌ణ‌బీర్ తో బ్రేకప్ త‌ర్వాత క‌త్రిన తిరిగి స‌ల్మాన్ గూటికే చేరింది. వ‌రుస‌గా అత‌డి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తూ బిజీగా ఉంది. టైగ‌ర్ జిందా హై త‌ర్వాత భార‌త్ చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం ద‌బాంగ్ 3లో ఓ స‌ర్ ప్రైజ్ పాత్ర‌లో న‌టిస్తుంద‌న్న ప్ర‌చారం ఉంది.

తాజాగా సింగ‌పూర్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌ల్మాన్ తో త‌న ప్ర‌త్యేక అనుబంధం గురించి క‌త్రిన ఓపెన్ అయ్యింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా.. వెండితెర‌పై మా అనుబంధం వేరు. తెర‌వెన‌క అనుబంధం వేరు! అంటూ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. కెరీర్ ప‌రంగా తాను ఎంతో ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో త‌న‌ని అర్థం చేసుకుని అండ‌గా నిలిచిన మంచి మ‌న‌సున్న హీరో స‌ల్మాన్ అని కితాబిచ్చింది. ప‌దిమందికి సాయ‌ప‌డే త‌త్వం ఉన్న గొప్ప హీరో అని పొగిడేసింది. క‌ష్టంలో ఆదుకునే త‌త్వం అత‌డిది. అందుకే అత‌డు నా జీవిత‌కాల‌ స్నేహితుడు అని క‌త్రిన‌ తెలిపింది. స‌ల్మాన్ చెల్లెళ్లు అల్విద‌.. అర్పిత త‌న‌కు ఎనిమిదో తొమ్మిదో చెల్లెళ్ల‌తో స‌మానం అంటూ కితాబిచ్చింది. ఆ ఇద్ద‌రితో ఎంతో స‌న్నిహితంగా ఉంటాన‌ని తెలిపింది.

అయితే స‌ల్మాన్ తో ప్రేమ‌లో ఉందా లేదా? అన్న‌ది మాత్రం క‌త్రిన చెప్ప‌లేదు. కేవ‌లం స్నేహితుడు మాత్ర‌మేన‌నే అర్థం వ‌చ్చేలా మాట్లాడింది. క‌త్రిన ప్ర‌స్తుతం రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలోని సూర్య‌వంశీ అనే చిత్రంలో న‌టించ‌నుంది. అక్ష‌య్ కుమార్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. 27 మార్చి 2020న ఈ చిత్రం రిలీజ్ కానుంది.