Begin typing your search above and press return to search.

వైట్ లో కేట్ రచ్చ చేస్తోంది

By:  Tupaki Desk   |   1 Dec 2016 7:30 PM GMT
వైట్ లో కేట్ రచ్చ చేస్తోంది
X
అటు సినిమాలు ఇటు బ్రాండ్ అండార్స్ మెంట్స్ తో పాటు ఫోటోషూట్స్ కవర్ పేజ్ లతో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బోలెడంత బిజీబిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గా ఈ భామ మాల్దీవ్స్ వెళ్లి అక్కడ బీచ్ ల నుంచి తెగ ఫోటోలు షేర్ చేస్తోంది. మాల్దీవ్స్ లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి రోజుకో ఫోటో చొప్పున చూపిస్తూ.. రకరకాల పోజుల్లో అందాల విందు చేస్తోంది.

ఇంతకీ ఇన్నేసి ఫోటోలు పంచుకుంటోందిగా.. ఎంజాయ్ చేయడానికి వెళ్లిందనుకుంటారేమో.. బజార్ బ్రైడ్ మేగజైన్ కి ఫోటో షూట్ కోసం ఇంతదూరం వెళ్లిన భామ.. అభిమానులను మాత్రం అస్సలు మరిచిపోవడం లేదు. తన గురించి తలుచుకోకుండా ఉండేందుకు చిన్నపాటి గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. తాజాగా ఇలా వైట్ అండ్ వైట్ లో రచ్చ చేస్తున్న ఫోటోను నెట్ లో పెట్టేసింది కత్రినా.

ఇక్కడ పని పూర్తయిపోయిందట అందుకే బైబై మాల్దీవ్స్ అంటూ గుడ్ బై చెబతూ.. ఇలా అందాలు కనిపించేలా తడిసిన స్లీవ్ లెస్ టాప్.. మినీ బాటమ్ తో.. పై నుంచి కిందవరకు అన్ని అందాలను బీచ్ లో ఆరబెట్టుకుంటూనే.. ఇటు అభిమానులను పండగ చేసుకోమంటోంది కత్తిలాంటి బ్యూటీ. సినిమాలు బోల్తా కొడుతున్నా.. టాప్ గేర్ లో దూసుకుపోవడంలో కేట్ అసలు సీక్రెట్ ఇదే అనుకుంటా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/