Begin typing your search above and press return to search.

బీచ్ లో నడిచొస్తున్న కత్తిని చూశారా

By:  Tupaki Desk   |   2 Jun 2016 7:30 AM GMT
బీచ్ లో నడిచొస్తున్న కత్తిని చూశారా
X
కత్రినా కైఫ్ ని చూడగానే కత్తిలాంటి ఫిగర్ అనిపించకపోతే.. చూసేవాళ్ల కళ్లలో ఏదో తేడా ఉన్నట్లే. కెరీర్ మొదట్లో కాస్త తటాపటాయించినా.. మెల్లగా ఇండస్ట్రీకి, జనాలకు ఏం కావాలో ఏం చూపించాలో బాగానే తెలుసుకుంది ఈ భామ. ముఖ్యంగా సల్మాన్ తో పరిచయం తర్వాత బాగా ముదిరిపోయింది. ఇప్పుడీ సుందరాంగి టాప్ రేంజ్ కి చేరిపోయిందంటే.. అందులో అమ్మడు కొత్తగా అలవర్చుకున్న ట్యాలెంట్లే ఎక్కువ పాత్ర పోషిస్తాయి.

సినిమాల్లో మాత్రమే కాదు.. ఎప్పుడు ఎక్కడ ఈమెను చూసిన నరాలు జివ్వుమనిపించేలా పోజులివ్వడం కేట్ స్పెషాలిటీ. రీసెంట్ గా వోగ్ మేగజైన్ కోసం.. బీచ్ వేర్ లో సెక్సీ పోజులు ఇచ్చింది కత్రినా. లెదర్ కేజ్ బికినీలో అమ్మడి అందాలు అదరహో అనాల్సిందే. ఎలాగూ కేట్ కళ్లలోనూ కావాల్సినంత కైపు ఉంటుంది. ఫేస్ ఫీలింగ్స్ తో మత్తెక్కిస్తుంది. వీటన్నిటికీ తోడు ఒక చెవికి మాత్రమే పెట్టిన ఫెదర్ ఇయర్ రింగ్ డిఫరెంట్ గా ఆకట్టుకుంటుంది.

ఇంకొంచెం కిందకు దిగొస్తే.. క్లీవేజ్ షో విషయంలో ఈ మధ్య బాలీవుడ్ కొత్త పాఠాలు బాగానే నేర్చుకుంటోంది. వీటిని కత్రినా కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోయింది. అమ్మడి బికినీ డ్రస్ లోని అందాలను పైకి కనిపించకుండా ఏ మాత్రం ఆపలేకపోతున్న.. నెట్టెడ్ టాప్.. ఈ గెటప్ కి మరింత ఎట్రాక్షన్ గా మారింది. మొత్తం మీద ఇలా కత్రినాను చూస్తుంటే.. బీచ్ లోంచి ఓ కత్తి నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది కదూ.