Begin typing your search above and press return to search.

క‌త్రిన కైఫ్‌ ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్ వైర‌ల్

By:  Tupaki Desk   |   20 March 2021 7:00 PM IST
క‌త్రిన కైఫ్‌ ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్ వైర‌ల్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎదురే లేని నాయిక‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ‌ 37 వ‌య‌సులోనూ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో నేటిత‌రానికి పోటీనిస్తోంది. ఈ రూపం కోసం క‌త్రిన ఎంతో నిబ‌ద్ధ‌త‌తో జిమ్ యోగా సెష‌న్స్ కి ఎటెండ్ అవుతుంటారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌లో నేటిత‌రానికి క‌త్రిన‌ ఆద‌ర్శం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..ఈనెల‌లోనే `ఏక్ థా టైగర్` మూడవ భాగం చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న‌ క‌త్రిన క‌థానాయిక గా న‌టించ‌నుంది‌. టైగర్ 3 టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీని ప్ర‌ఖ్యాత‌ యష్ రాజ్ ఫిలింస్ సంస్థ‌ నిర్మిస్తోంది. టైగ‌ర్ సిరీస్ లో రెండు సినిమాలు ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సాధించ‌డంతో మూడో భాగంపైనా అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రోవైపు టైగ‌ర్ ద‌ర్శ‌కుడు జాఫ‌ర్ `సూప‌ర్ గాళ్` ఫ్రాంఛైజీని లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో సూప‌ర్ ఉమెన్ త‌ర‌హా పాత్ర‌లో క‌త్రిన స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌ని ఇంత‌కుముందు ఆయ‌న వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ సూప‌ర్ గాళ్ రోల్ కోసం క‌త్రిన ప్రిప‌రేష‌న్ ప్రారంభించార‌ని క‌థ‌నాలొచ్చాయి.తాజాగా క‌త్రిన‌ స్పోర్ట్ లుక్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. జిమ్ లో పూర్తిగా టాప్ టు బాట‌మ్ స్పోర్ట్స్ ట్రాక్ లో క‌నిపించారు క‌త్రిన‌. బ్రాండెడ్ బ్లాక్ ట్రాక్ సూట్ లో క‌త్రిన స్పెష‌ల్ ఫోటోషూట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.