Begin typing your search above and press return to search.

కత్తి లాంటి సుందరి సాహో అంటోందా?

By:  Tupaki Desk   |   13 May 2017 7:34 AM GMT
కత్తి లాంటి సుందరి సాహో అంటోందా?
X
బాహుబలి2 మూవీకి సినిమా లోకం మొత్తం సాహో అంటోంది. సాహో రాజమౌళి అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తుంటే.. బాహుబలి పాత్రధారి ప్రభాస్ కు కుర్రకారు సాహో అనేస్తున్నారు. ఈ విషయాన్ని ముందే ఊహించడంతోనే.. ప్రభాస్ తో చిత్రీకరించే సినిమాకి 'సాహో' అని టైటిల్ పెట్టాడు దర్శకుడు సుజిత్.

ఇప్పటికే సాహో టీజర్ కూడా రిలీజ్ అయిపోగా.. మిలియన్స్ కొద్దీ రికార్డ్ వ్యూస్ వచ్చేశాయి. ప్రస్తుతం అమెరికాలో హాలిడే టూర్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ఇండియాకి తిరిగి రాగానే.. సాహో షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే.. పరిణీతి చోప్రాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడీ అవకాశం బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్ చేతికి అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కత్రినాకు నెరేషన్ కూడా ఇచ్చాడట దర్శకుడు. ప్రభాస్ తో మూవీ అంటే ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.

హిందీ.. తెలుగు.. తమిళ్.. మలయాళ భాషల్లో రిలీజ్ కానుండడంతో.. సాహోకు కత్రినా దాదాపు ఓకే చెప్పినట్లే అంటున్నారు. అయితే ఇంకా అగ్రిమెంట్స్ పై సంతకాలు మాత్రం చేయలేదట. అదొక్కటి పూర్తి కాగానే.. సాహో హీరోయిన్ గా కత్రినా అంటూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇస్తారని.. ప్రభాస్ ఇండియా రాగానే ఇదే అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/