Begin typing your search above and press return to search.

‘జీరో’ సుందరిగా కత్రినా కైఫ్

By:  Tupaki Desk   |   5 March 2018 5:41 AM GMT
‘జీరో’ సుందరిగా కత్రినా కైఫ్
X
బాలీవుడ్ లో ఈ సంవత్సరం రాబోతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో జీరో ఒకటి. షారుఖ్ ఖాన్ హీరోగా భార్య గౌరీ ఖాన్ స్వీయ నిర్మాణంలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. షారుఖ్ తో పాటు ఇతర కీలక పాత్రధారులు ఇందులో మరుగుజ్జులుగా కనిపిస్తారు. కాని ఆ ఎపిసోడ్ కొంతవరకే ఉంటుందని సినిమా కథాంశం ఊహించని రీతిలో ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా తీర్చి దిద్దానని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చెబుతున్నాడు. ఇందులో ఇద్దరు హీరొయిన్లు. ఒకరు కత్రినా కైఫ్. మరొకరు అనుష్క శర్మ. కైఫ్ లుక్ ఎలా ఉంటుందా అనే దాని గురించి రకరకాల అంచనాలు ఉన్న నేపధ్యంలో షూటింగ్ లో నుంచి ఒక స్టిల్ లీక్ కావడం బాగా వైరల్ అవుతోంది.

ఏదో దేశానికి మహారాణిలా ఉన్న కత్రినా సైడ్ కట్ స్టిల్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇందులో కత్రినా సినిమాల్లో నటించే హీరొయిన్ పాత్రనే పోషిస్తోంది. కాని అది తన పేరు మీద ఉండదట. తనను పిచ్చిగా ఆరాధించే పాత్రను షారుఖ్ ఖాన్ చేస్తుండగా షారుఖ్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పాత్రను అనుష్క శర్మ వేస్తోంది. కాని అసలు జీరో అంటే టైటిల్ ఎందుకు పెట్టారు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టొరీ లో మర్రుగుజ్జులుగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మాత్రం సస్పెన్స్. సల్మాన్ ఖాన్ నుంచి చేజారి షారుఖ్ చేతిలో పడ్డ ఈ జీరో మీద పర్సనల్ గా కింగ్ ఖాన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

టైగర్ జిందా హై సక్సెస్ తో జోష్ మీదున్న కత్రినా ఇది తనకు మరో మేజర్ బ్రేక్ ఇస్తుందని నమ్ముతోంది. పరితో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో భయపెట్టడంలో విఫలమైన అనుష్క శర్మ తన యాక్టింగ్ తో అందరిని మెప్పించింది. ఈ ఇద్దరి కాంబోలో షారుఖ్ మూవీ కాబట్టి క్రేజ్ కేమి లోటు ఉండదు. ఈ ఏడాది డిసెంబర్ 21న జీరో విడుదల చేయనున్నారు.