Begin typing your search above and press return to search.

పొట్టోడికి వంగి మరీ లిప్‌ కిస్‌..

By:  Tupaki Desk   |   3 Nov 2018 6:12 AM GMT
పొట్టోడికి వంగి మరీ లిప్‌ కిస్‌..
X
బాలీవుడ్‌ మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ‘జీరో’ చిత్రం ట్రైలర్‌ నిన్న షారుఖ్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయడం జరిగింది. ప్రేక్షకుల ముందు షారుఖ్‌ మాయాజాలం చేశాడు. మరుగుజ్జు పాత్రలో షారుఖ్‌ కనిపించాడు. ఏమాత్రం తేడా అనిపించుకుండా, చాలా సహజంగా నిజంగానే షారుఖ్‌ అంత పొట్టిగా ఉన్నాడా అన్నట్లుగా ఈ ట్రైలర్‌ లో చూపించడం జరిగింది. మొదటి నుండి ఈ చిత్రంకు భారీ క్రేజ్‌ దక్కింది. హీరో మరగుజ్జు ఏంటీ? టైటిల్‌ జీరో ఏంటా అంటూ అంతా అనుకున్నారు. మరగుజ్జు అయిన షారుఖ్‌ జీరో నుండి హీరో ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌ అని ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంది.

తానో మరగుజ్జు అవ్వడం వల్ల పెళ్లి ఎవరు చేసుకోరేమో అని ఆందోళన చెందుతున్న సమయంలో షారుఖ్‌ కు అనుష్క మరియు కత్రీనాలు పరిచయం అవ్వడం ఆ తర్వాత వారితో జరిగి లవ్‌ ట్రాక్‌ అంతా కూడా సరదాగా చిత్రీకరించినట్లుగా అనిపిస్తుంది. ఇక పొట్టి వాడైన షారుఖ్‌ కు పొడుగు కాళ్ల సుందరి కత్రీనా కైఫ్‌ వంగి మరీ ఘాటైన ముద్దు పెట్టడం సినిమాకు మరింత హైప్‌ తీసుకు వచ్చింది. ఇలాంటి రొమాంటిక్‌ సీన్స్‌ కూడా సినిమాలో బాగానే ఉన్నాయి, పొట్టోడని తక్కువ అంచనా వేయవద్దని ఈ మద్దు సీన్‌ తో చెప్పకనే చెప్పారు.

మరో వైపు అనుష్క మరియు షారుఖ్‌ ల మద్య కూడా ఆకట్టుకునే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. అమీర్‌, సల్మాన్‌ ఖాన్‌ లు గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంను షారుఖ్‌ తన సొంత బ్యానర్‌ రెడ్‌ చిల్లీస్‌ లో నిర్మించడం జరిగింది. ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.