Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : స్విమ్మింగ్‌ పూల్ నుండి థ్యాంక్యూ

By:  Tupaki Desk   |   17 July 2021 7:00 PM IST
ఫొటోటాక్ : స్విమ్మింగ్‌ పూల్ నుండి థ్యాంక్యూ
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌. ఈ అమ్మడి బర్త్‌ డే తాజాగా జరిగింది. ఆ సందర్బంగా అభిమానులు మరియు సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్నంతా కూడా కత్రీనా బర్త్‌ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లింది. కత్రీనా అంటే ఇప్పటికి ఇంత మంది అభిమానిస్తున్న వారు ఉన్నారా అంటూ జాతీయ మీడియా సైతం ఆశ్చర్యపోయేలా ఆమె బర్త్‌ డే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యిందట. అంతగా తనకు బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పినందుకు గాను అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

అభిమానులకు కృతజ్ఞతలకు నార్మల్‌ గా చెప్తే స్పెషల్‌ ఏముంది అని అనుకుందో ఏమో కాని బాలీవుడ్‌ తో పాటు అందరిని ఆకట్టుకునేలా తన వైపు మరోసారి దృష్టి మరల్చుకునేలా ఈ అమ్మడు నెట్టింట స్విమ్మింగ్‌ పూల్‌ లో రెండ్‌ స్విమ్‌ సూట్‌ లో ఉన్న ఫొటోను షేర్‌ చేసి అందరికి కృతజ్ఞతలు చెప్పింది. స్విమ్మింగ్‌ పూల్‌ లో రెడ్‌ స్విమ్‌ సూట్‌ లో ఉన్న ఫొటో ను షేర్‌ చేయడంతో మళ్లీ కత్రీనా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా ఆమె గురించిన వార్తలు వినిపిస్తున్నాయి.

తనపై అంతటి ప్రేమ వర్షం కురిపించిన వారందరికి కృతజ్ఞతలు అన్నట్లుగా ఆమె షేర్‌ చేసింది. మొత్తానికి ముద్దుగుమ్మ నెట్టింట షేర్‌ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్విమ్మింగ్ పూల్‌ లో కాకుండా స్విమ్‌ సూట్ లోనే స్విమ్మింగ్‌ పూల్‌ ఒడ్డున తడసిన అందాలతో ఉన్న పొటోను షేర్‌ చేస్తే ఇంకా బాగుండేది కదా అంటూ కొందరు అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరుగుతున్నా కొద్ది అమ్మడి ఆఫర్లు పెరుగుతున్నాయి.. ఆదాయం కూడా పెరుగుతుందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నారు. సాదారణ స్థితిలో జర్నీ మొదలు పెట్టిన కత్రీనా కైఫ్‌ ప్రస్తుతతం రూ. 150 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నట్లుగా చెబుతున్నారు.