Begin typing your search above and press return to search.

వీడియో: క‌త్రిన‌ కోసం బ‌రిలో దిగిన ప్రియుడి కోచ్

By:  Tupaki Desk   |   2 April 2021 4:06 PM IST
వీడియో: క‌త్రిన‌ కోసం బ‌రిలో దిగిన ప్రియుడి కోచ్
X
రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో క‌త్రిన అందం కించిత్ అయిన కింగ లేదు అంటే దానికి త‌న క‌ఠోర శ్ర‌మ‌.. ఫిట్నెస్ ఫార్ములానే కార‌ణ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్ గా త‌న‌ హార్డ్ వ‌ర్క్ గురించి తెలిసిందే. ప్ర‌తిసారీ జిమ్ యోగా సెష‌న్స్ నుంచి ఆస‌క్తిక‌ర‌ వ‌ర్క‌వుట్ల వీడియోల‌ను ఫోటోల‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా కోచ్ స‌మ‌క్షంలో జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోని క‌త్రిన షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

అయితే క‌త్రిన‌కు ట్రైన‌ర్ గా క‌నిపిస్తున్న అత‌డు ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. అతడి పేరు ముస్త‌ఫా. క‌త్రిన ప్రియుడు విక్కీ కౌషల్ కి శిక్షకుడిగా ప‌ని చేస్తారు. అలాగే విక్కీ సినిమాల్లో అత‌డు క్యారెక్ట‌ర్ న‌టుడిగానూ కనిపిస్తుంటారు.

తాజా వీడియోలో క‌త్రిన హార్డ్ వ‌ర్క్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓవైపు జిమ్ లో స్వేదం చిందిస్తూ క‌త్రిన అదే ప‌నిగా వ‌ర్క‌వుట్లు చేస్తోంది. జిమ్ లో క‌త్రిన‌ నీలిరంగు స్పోర్ట్స్ బ్రా ధరించి.. వాష్ ‌బోర్డ్ యాబ్స్ ను ప్రదర్శిస్తూ ఆరెంజ్ క్రాప్ టాప్ తో క‌నిపిస్తోంది. ఈ క్లిప్ లో కత్రినా ర‌క‌ర‌కాల‌ వ్యాయామాలు చేస్తోంది. లెగ్ రైజెస్ - లాంగ్ ఫుట్ - పుష్-అప్స్ - ఫ్లో వర్కౌట్ సహా ఫ్లోర్ ఎక్స‌ర్ సైజుల్ని చేస్తూ క‌నిపించింది.

కత్రినా కైఫ్ -విక్కీ కౌషల్ అభిమానులు గమనించిన ఆస‌క్తిక‌ర‌ విషయం ఏమిటంటే ఆ ఇద్ద‌రికీ ఒకే కామ‌న్ ట్రైన‌ర్ సాయం చేస్తుండ‌డం. విక్కీ కౌషల్ కు కూడా ఇటీవల అత‌డే శిక్షణనిస్తున్నాడు. ఈ వీడియోలో క‌నిపిస్తున్న ముస్తఫా రాధికా అహ్మద్.. విక్కీ ఇన్ స్టాగ్రామ్ లోనూ శిక్షణనిస్తూ క‌నిపిస్తాడు. క‌త్రిన ప్ర‌స్తుతం టైగ‌ర్ 3 స‌హా ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.