Begin typing your search above and press return to search.

అమీర్-అమితాబ్ మెగా ప్రాజెక్టులో ఆమె..

By:  Tupaki Desk   |   12 May 2017 5:03 AM GMT
అమీర్-అమితాబ్ మెగా ప్రాజెక్టులో ఆమె..
X
‘బాహుబలి’ని కొట్టే సినిమా తీయాలని మిగతా ఇండస్ట్రీల వాళ్లు గట్టి పట్టుదలతోనే ఉన్నారు. కోలీవుడ్లో ‘2.0’తో పాటు ‘సంఘమిత్ర’ లాంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. మరోవైపు మలయాళం వాళ్లు వెయ్యి కోట్ల మహాభారతం ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకోవైపు బాలీవుడ్లోనూ ఓ భారీ సినిమా తెరమీదికి రాబోతోంది. అదే.. థగ్స్ ఆఫ్ హిందోస్థాన్. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారి కలిసి నటించబోతున్న సినిమా ఇది. ఈ మెగా కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ‘ధూమ్-1’.. ‘ధూమ్-2’ సినిమాలకు రచయితగా పని చేసి.. ‘ధూమ్-3’తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించబోయే సినిమా ఇది.

ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఇంకో పెద్ద స్టార్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు.. కత్రినా కైఫ్. ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’లో కత్రినానే కథానాయిక అని అమీర్ ఖాన్ స్వయంగా ప్రకటించాడు. ‘దంగల్’లో అమీర్ కూతురిగా నటించిన సనా షేక్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించనుంది. అమీర్-కత్రినా కలిసి విజయ్ కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘ధూమ్-3’లో జంటగా నటించాడు. ఆ హిట్ కాంబోనే రిపీట్ చేస్తున్నాడిప్పుడు. ధూమ్-3 టైంతో పోలిస్తే.. ఆ తర్వాత కత్రినా డౌన్ అయింది. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి టైంలో ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ లాంటి మెగా ప్రాజెక్టులో అవకాశం దక్కడం గొప్ప విషయమే. యశ్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/