Begin typing your search above and press return to search.

ప్ర‌కృతి అందాల్లో మ‌మేక‌మైన లేడీ టైగ‌ర్

By:  Tupaki Desk   |   19 Sep 2021 12:30 AM GMT
ప్ర‌కృతి అందాల్లో మ‌మేక‌మైన లేడీ టైగ‌ర్
X
బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఇన్ స్టాలో ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా సినిమా అప్ డేట్ల‌ను..విదేవీ విహార‌యాత్ర‌ల‌ను ఇదే వేదిక‌గా ఎక్కువ‌గా అభిమానుల‌కు షేర్ చేస్తుంటుంది. ఇటీవ‌లే `టైగ‌ర్ -3` షూటింగ్ కోసం విదేశాల్ని చుట్టేస్తున్నామ‌ని క‌త్రిన వెల్ల‌డించింది. అక్క‌డ అంద‌మైన ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను సైతం ఇన్ స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. ర‌ష్యా..ట‌ర్కీ ల్లో షూటింగ్ జ‌రిగింది. అక్క‌డ అప్ డేట్స్ ఇస్తూ త్వ‌ర‌లోనే ఆస్ట్రియా కూడా వెళ్తున్న‌ట్లు రివీల్ చేసింది. తాజాగా ఆస్ట్రియా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణలో బిజీగా ఉన్న‌ట్లు తెలిపింది. అక్క‌డ ప‌ర్స‌న‌ల్ సెల్ఫీలు.. వీడియోలు తీసి అభిమానుల‌కు చేరవేసింది.

ఆస్ట్రియాలోని సాల్డ్ బ‌ర్గ్ వంతెన‌పై క‌త్రినా నేచుర్ ని ఆస్వాధిస్తున్న‌ట్లు ఓ ఫోటోలో చూపించింది. ఆ స‌మ‌యంలో వాతావ‌ర‌ణం ఎంతో కూల్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. క‌త్రినా బ్రిడ్జి కిందుగా పారుతున్న‌ వాట‌ర్ ని చూస్తోంది. పైనా ఆకాశం మేఘాల‌తో కమ్మేసి ఉంది. ఈ వాతావ‌ర‌ణంలో క‌త్రినా బూడిద రంగు కార్డిగాన్ ధ‌రించింది. కురుల‌ను అలా గాలికి వ‌దిలేసి ప్ర‌కృతి అందాల్లో మ‌మేక‌మైపోయింది. మ‌రో ఫోటోలో ప‌చ్చ‌ని గ‌డ్డిలో ప‌రుగులెడుతోంది. చుట్టూ ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం..భారీ చెట్ల న‌డుమ క‌త్రినా చిల్ అవుతోంది. ఇందులో క‌త్రినా డెనిమ్ జీన్..క్యాజువ‌ల్ ష‌ర్ట్ ధ‌రించిన‌ట్లు క‌నిపిస్తుంది. కెమెరాని దాటి క్రాస్ చేస్తున్న స‌మ‌యంలో తీసిన ఫోటో ఇది. ప్ర‌స్తుతం ఈ రెండు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక టైగ‌ర్ -3 విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే చాలా భాంగం విదేశాల్లో షూటింగ్ చేసారు. చివ‌రిగా ఆస్ట్రియా షెడ్యూల్ లో యూనిట్ బిజీగా ఉంది. అక్క‌డ చిత్రీక‌ర‌ణ ముగించుకుని నేరుగా ముంబైలో ప‌య‌నం కానున్నారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.