Begin typing your search above and press return to search.
ఆమె ఆదాయం వేల నుండి వందల కోట్లకు చేరింది
By: Tupaki Desk | 17 July 2021 4:00 PM ISTబాలీవుడ్ లో గత దశాబ్ద కాలంకు పైగా కత్రీనా కైఫ్ అంటే ఒక హాట్ బ్యూటీ అనే పేరు ఉంది. అలాంటి కత్రీనా కైఫ్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంది. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని భారీ సినిమాలను కూడా చేస్తుంది అనడంలో సందేహం లేదు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆమె క్రేజ్ పెరుగుతుంది కాని తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడంతో పాటు పదుల సంఖ్యలో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కత్రీనా కైఫ్ కెరీర్ ఆర్థికంగా చాలా కింది స్థాయి నుండి మొదలు అయ్యింది. ఆమె హీరోయిన్ గా కెరీర్ ఆరంభించడానికి ముందు ఆమె ఆదాయం చాలా తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 150 నుండి 160 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాల టాక్.
కేవలం సినిమాల ద్వారానే అయితే ఆమె ఆదాయం ఇంత వచ్చి ఉండేది కాదు. ఆమె చాలా తెలివిగా బ్రాండ్స్ ను ఎంపిక చేసుకుని కోట్ల పారితోషికాలు తీసుకుంటుంది. అంతే కాకుండా సొంతంగా వ్యాపారాలు చేయడం.. కార్లను కొనుగోలు చేయడం రియల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వంటి తెలివైన పనుల కారణంగా ఆమె ఆదాయం ఏకంగా 150 కోట్లను మించి ఉందంటున్నారు. సల్మాన్ ఖాన్ ఈమెను బాలీవుడ్ కు పరిచయం చేశాడు. బాలీవుడ్ లో ఒకానొక సమయంలో టాప్ స్టార్ గా దూసుకు పోయిన ఈమె ఇప్పుడు కాస్త వెనుక పడ్డా కూడా పారితోషికం విషయంలో మాత్రం ఇతర బడా హీరోయిన్స్ తో పోటీ పడుతుంది అనడంలో సందేహం లేదు.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న పలు సినిమాల్లో ప్రస్తుతం ఈమె నటిస్తుంది. కెరీర్ కాస్త డల్ గా ఉంది అనుకుంటున్న సమయంలో సమయంలో కూడా ఈమెకు ఆఫర్ అదృష్టం కలిసి వస్తున్నాయి. దాంతో మళ్లీ పుంజుకుంటుంది. ప్రస్తుతం పది కోట్లకు పైగా పారితోషికం తీసుకోవడంతో ఈమె రేంజ్ అమాంతం పెరిగి పోయింది. అద్బుతమైన పాత్రలతో పాటు అందం మరియు తన డాన్స్ తో ఫిజిక్ తో స్టార్ డం ను దక్కించుకుని అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఒకప్పుడు వేల రూపాయల సంపాదనతో ఉండేది కాని ఇప్పుడు ఆమె సంపాదన వందల కోట్లకు చేరింది.
ముందు ముందు ఆమె ఇదే తరహాలో తెలివిగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగితే వందల కోట్లు కాస్త వేల కోట్ల వరకు అయినా ఆశ్చర్యం లేదు. ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు స్టేటస్ సింబల్ గా భావించే ల్యాండ్ రోవర్.. రేంజ్ రోవర్ వంటి అత్యాధునిక కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కూడా కొందరు ఈ రేంజ్ లో సంపాదించుకున్నది లేదు. కాని కత్రీనా మాత్రం తెలివిగా భారీ ఎత్తు ఆదాయంను పోగు చేసుకుంది.