Begin typing your search above and press return to search.

ఆమె శోభ‌నం స‌రే ఈమె శోభ‌నం సంగ‌తేంటీ?

By:  Tupaki Desk   |   6 Sep 2022 10:38 AM GMT
ఆమె శోభ‌నం స‌రే ఈమె శోభ‌నం సంగ‌తేంటీ?
X
'కాఫీ విత్ కరణ్ 7' వేడి ఇప్ప‌ట్లో త‌గ్గేట్టు లేదు. హోస్ట్ క‌రణ్ అడిగే శోభ‌నాంగి ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రైనా బుట్ట‌లో ప‌డాల్సిందే. ల‌వ్ రొమాన్స్ డేటింగ్ బ్రేక‌ప్! అంటూ అంత‌కంత‌కు హీటెక్కిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కత్రిన కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు. ఇంత‌కుముందు ఆలియా భ‌ట్.. జాన్వీ క‌పూర్.. అన‌న్య పాండే.. సారా అలీఖాన్ ల‌కు ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఇప్పుడు క‌త్రిన కూడా అలాంటి ఒక ప్ర‌శ్న‌ను ఎదుర్కొంది. ఈసారి క‌త్రిన‌ను కూడా శోభ‌నం గురించి ప్ర‌శ్నించాడు క‌ర‌ణ్‌. దానికి క‌త్రిన అంతే కొంటెగా స్పందించింది. శోభ‌నం అవ్వ‌క‌పోయినా శుభ‌దినం అనుకోవాలి! అంటూ క‌త్రిన విసిరిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా ప్రోమోలో ఇది టెంప్టింగ్ మ్యాట‌ర్!

పెళ్లి తర్వాత అలియా భట్ 'సుహాగ్రత్' లాంటిదేమీ లేదు' అని అంది క‌దా..? అని క‌ర‌ణ్ ప్ర‌శ్నిస్తుంటే.... ప్రతిస్పంద‌నగా 'సుహాగ్దిన్' (శుభ‌దినం) ఉండవచ్చని కత్రినా కైఫ్ చెప్పింది. కాఫీ విత్ కరణ్ 7 తాజా ఎపిసోడ్ లో ఫోన్ భూత్ స్టార్ లు కత్రినా కైఫ్- ఇషాన్ ఖత్త‌ర్- సిద్ధాంత్ చతుర్వేది అతిథులుగా పాల్గొన్నారు. ఆ ముగ్గురూ క‌ర‌ణ్ తో బోలెడంత సంద‌డి చేసారని తాజా టీజ‌ర్ చెబుతోంది.

ఈ కొత్త సీజన్‌ ఇప్పటికే పదవ ఎపిసోడ్ ర‌న్నింగ్ లో ఉంది. త‌దుప‌రి ఎపిసోడ్ లో ఫోన్ భూత్ స్టార్ లతో సంద‌డే సంద‌డి నెల‌కొన‌నుంది. కత్రినా కైఫ్- సిద్ధాంత్ చతుర్వేది - ఇషాన్ ఖట్టర్ ఈ షోలో ఎంతో ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. కొంత వినోదం.. కొన్ని గాసిప్ లు మరిన్ని విందైన ప్ర‌శ్న‌ల‌ను షోలో సంధిస్తున్నారు క‌ర‌ణ్‌. ప్రోమో విడుదలై ఆద్యంతం ఆసక్తిని క‌లిగించింది.

బాలీవుడ్ లో పెళ్లిళ్ల వ్య‌వ‌హారంపై క‌ర‌ణ్ ప్ర‌శ్న‌లు ఆగేట్టు లేవు. ముఖ్యంగా శోభ‌నం (సుహాగ్ రాత్) గురించి కాఫీ విత్ కరణ్ సోఫాలో చ‌ర్చ అనంతంగా సాగుతోంది. ఆమె శోభ‌నం సంగ‌తి స‌రే మీ శోభ‌నం సంగ‌తేంటీ? అంటూ క‌ర‌ణ్ సూటిగానే అడిగేస్తున్నాడు. లేదా డొంక తిరుగుడుగా ప్ర‌శ్నిస్తూ స‌మాధానాలు రాబ‌డుతున్నాడు.

అలియా భట్ సుహాగ్ రాత్ అనే భావనను అపోహగా కొట్టిపారేయగా ఇటీవల వివాహం చేసుకున్న కత్రినా కైఫ్ 'అలసిపోయిన జంట'ను అనుసరించడానికి ఒక తెలివైన పరిష్కారాన్ని ఎంపిక చేసుకుంద‌ట‌. వీడియోలో కరణ్ జోహార్ సుహాగ్రాత్ కాన్సెప్ట్ గురించి కత్రినా కైఫ్ ను అడిగాడు. ఇంత‌కుముందు నూతన వధువు అలియా భట్ ను కరణ్ ఇదే ప్ర‌శ్న‌ అడిగారు. ఆలియా వివాహం చేసుకున్న తర్వాత బస్ట్ అయిన భారతీయ వివాహాల గురించి వివాహ అపోహల‌ గురించి క‌ర‌ణ్ ప్ర‌శ్నించారు.

గ‌త ఎపిసోడ్ లో ఆలియా స్పందిస్తూ.. ''సుహాగ్రాత్ ఏమీ లేదు... మేం అల‌సిపోయాం'' అని అస‌లు నిజం ఒప్పుకోవ‌డంతో అది వీక్ష‌కుల‌ను షాక్ కి గురి చేసింది. డిసెంబర్ 2021లో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న కత్రినా కైఫ్ ను కరణ్ ఇదే ప్రశ్న అడిగాడు. దానికి క‌త్రిన స్పందిస్తూ 'సుహాగ్దిన్'ని కలిగి ఉండవచ్చని చెప్పింది. ఇది ఎల్లప్పుడూ సుహగ్రాత్ కావాల్సిన‌ అవసరం లేదు. ఇది సుహాగ్దిన్ కూడా కావచ్చు''అని క‌త్రిన వాదించింది. అంటే శోభ‌నం జ‌ర‌గ‌క‌పోయినా త‌న‌కు శుభ‌దినం కావొచ్చ‌నేది క‌త్రిన ఉద్ధేశం. ప్రోమోలో అనన్య పాండేతో బ్రేక‌ప్ వ్య‌వ‌హారంపై ఇషాన్ ఖట్టర్ ఓపెన‌య్యాడు. అయితే సిద్ధాంత్ చతుర్వేది మాత్రం తాను ఇంకా ఒంటరిగా ఉన్నాన‌ని ధృవీకరించాడు.

ఫోన్ బూత్ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. రవిశంకరన్ - జస్విందర్ సింగ్ బాత్ రచించారు. ఫోన్ భూత్ ను రితేష్ సిధ్వాని - ఫర్హాన్ అక్తర్ నేతృత్వంలోని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2022 నవంబర్ 4న విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.