Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కత్రినా డోసు చూడతరమా!!

By:  Tupaki Desk   |   31 July 2016 10:21 AM IST
ఫోటో స్టోరి: కత్రినా డోసు చూడతరమా!!
X
ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు.. బ్రేకప్ అనే ఒక ఘట్టం ముగిశాక సెక్సీ బ్యూటి కత్రినా కైఫ్‌ తన అందాల డోసును బాగా పెంచేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలవ్వనున్న బార్ బార్ దేఖో సినిమా కోసం అమ్మడు ఎక్కడాలేనంత రూప లావణ్యాన్ని దట్టించి ఆడియన్స్ పై తన గ్లామరసాన్ని ప్రయోగిస్తోంది. ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్‌ సాక్షిగా.. ఈ డోసుతో మనకు పిచ్చెత్తాల్సిందే.

ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత కరణ్‌ జోహార్. ఆయన ఏదో అలా ప్రకటిస్తే కిక్ ఏముంటుంది? అందుకే ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశాడు. ఒక బీచ్ లో నడుం లోతు నీళ్ళలో మునిగి.. ఆరెంజ్ బికినీ వేసుకున్న కత్రినా.. హీరో సిద్దార్ధ్ తో రొమాన్స్ చేస్తున్న సీన్ అది. అంతేకాదు.. అమ్మడు సింగిల్ పీస్ బికినీలో చింపేసిందని ఆ ఫోటో చూస్తే అర్ధమైపోతుందిలే. ఇప్పటికే ఈ సినిమాలోని కాలా ఛష్మా అనే పాట కోసం పక్కటెముకలను ఆరబోసి నడుం అందాలతో ఉడికించిన క్యాట్ ఇప్పుడు ఇలా బికినీ అందాలతో ఊరిస్తోంది.

ఏదేమైనా కూడా కత్రినా డోసు చూడతరమా అంటూ యువతంతా యుగళ గీతాలు పాడుకోవాల్సిందే. ఈ హాట్నెస్ అంతా చూస్తుంటే అక్కడ ఒక హీరోకు ఎక్కడో ఏదో అయినట్లు అనిపిస్తోందని బాలీవుడ్ టాక్‌.