Begin typing your search above and press return to search.

వీడియో టాక్: కత్తి వయస్సు బాగా తగ్గిందే

By:  Tupaki Desk   |   11 Aug 2016 5:10 PM GMT



ఏంటో ఈ సీజన్లో బాలీవుడ్ భామలంతా కలసి కట్టుకొని మరీ రెచ్చిపోతున్నారు. ఏదన్నా కొత్త సినిమా వస్తుంటే చాలు.. అందులో రొమాన్స్ పాళ్లు అమాంతం పెంచేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఫర్ సప్పోజు కత్తిలాంటి అందాలతో రెచ్చిపోతున్న కత్రినా కైఫ్‌ ను తీసుకోండి. అమ్మడు ఇప్పటికే ''బార్ బార్ దేఖో'' సినిమా కోసం బికినీ వేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ బికినీ వేసిన పాట ఎలా ఉందో తెలుసా?

'సౌ అసమాన్‌...' అంటూ సాగే ఆ పాటలో కత్రినా చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తన వెయిస్ట్ ను ఎన్నడూ లేనంతగా స్లిమ్ గా తయారుచేసిందేమో.. వావ్ అనిపిస్తోంది అంతే. చిన్నపాటి డెనిమ్ నిక్కర్లో అమ్మడు క్యాట్ వాక్ కు దగ్గర్లో అలా నడుం తిప్పుతూ నడుస్తుంటే మనకు మతిపోవాలంతే. ఇక బికినీ లుక్ లో కూడా అదరగొట్టేసింది. చాలా స్లిమ్మయిపోయిందని చెప్పొచ్చు. అయితే మన దగ్గర 30 దాటిన త్రిష, శ్రీయ, నయనతార కాస్త ముదురు మొహాల్లా కనిపిస్తుంటే.. కత్రినా మాత్రం 33 ఏళ్ళ వయస్సులో కూడా అంత హాటుగా పదహారు ప్రాయంతో ఎలా మెరుస్తోంది అంటారు?

నిజంగానే ఈ భామల డైలీ రొటీన్.. జిమ్మింగ్ మెథడ్స్.. అలాగే డైట్.. ఏం డిఫరెంటుగా ఉంటాయో తెలియదు కాని.. 30 దాటినా కూడా చాలామంది హాటీలు ఇంకా పిచ్చ హాటుగా పిచ్చెత్తిస్తున్నారు. ముందైతే గీ సాంగు సూడుండ్రి.