Begin typing your search above and press return to search.

సల్మాన్ గురించి కత్రినా సెన్సేషనల్ కామెంట్

By:  Tupaki Desk   |   26 April 2016 10:28 AM GMT
సల్మాన్ గురించి కత్రినా సెన్సేషనల్ కామెంట్
X
సల్మాన్ ఖాన్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్శీస్. తాగి కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి అది మళ్లీ రద్దయింది. మరోవైపు కృష్ణజింకల్ని వేటాడిన కేసు కూడా ఉంది. ఇంకా ఎన్నో వివాదాల్లో సల్మాన్ పాత్ర ఉంది. ఇలాంటోడిని ఏరి కోరి రియో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత క్రీడాకారుల బృందానికి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎంపిక చేసింది భారత ఒలింపిక్ సంఘం. దీని మీద దేశ్యాప్తంగా పెద్ద ఎత్తునే దుమారం రేగుతోంది. పేరొందిన క్రీడాకారులు చాలామంది ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ తరుణంలో సల్మాన్ మాజీ ప్రేయమసి కత్రినా కైఫ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అవుతోంది.

సల్మాన్‌ ను ఒలింపిక్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం మీద మీ అభిప్రాయమేంటి అని మీడియా వాళ్లు అడిగితే.. ‘‘సల్మాన్‌ వివాదంలో చిక్కుకోవడంలో కొత్తేం ఉంది’’ అంటూ ఆమె ఎదురు ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ కామెంట్ ద్వారా కత్రినా ఏం చెప్పదలుచుకుందనేది జనాలకు అర్థం కావడం లేదు. సల్మాన్ అనేవాడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పదలుచుకుందా లేక.. ఆ వివాదాల్ని లైట్ తీసుకోమని అనదలుచుకుందా అని జనాలు విశ్లేషించుకుంటున్నారు.

ఐతే కత్రినా కామెంట్ మాత్రం సల్మాన్ కు.. అతడి అభిమానులకు కాక తెప్పించేదే అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి కత్రినా ఇబ్బంది పడుతున్న టైంలో సల్మానే ఆమెను ఆదరించి అవకాశాలిప్పించాడు. స్టార్ హీరోయిన్ కావడానికి కారణమయ్యాడు. అలాంటోడి మీద ఇలాంటి కామెంట్ చేస్తుందా అని సల్మాన్ అభిమానులు కత్రినా మీద గుర్రుగా ఉన్నారు.