Begin typing your search above and press return to search.

హీట్ పెంచుతున్న పెళ్లికూతురు!!

By:  Tupaki Desk   |   10 Oct 2017 10:25 AM IST
హీట్ పెంచుతున్న పెళ్లికూతురు!!
X
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఎప్పటిప్పుడు మరింత అందాన్ని పంచుతూనే ఉంటుంది.అటు సినిమాల్లో మాత్రమే కాదు.. ఇటు ఆఫ్ స్క్రీన్ లోనూ అందాల మోత మోగించడంలో కత్రినా స్టైల్ సెపరేటుగా ఉంటుంది. ఇక ఫోటో షూట్స్ విషయానికి వస్తే.. అసలు అమ్మడిని కట్టడి చేయడం మహా కష్టం అనిపించేస్తుంది.

తాజాగా ఈ భామ హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం చాలా చాలా స్పెషల్ గా ఫోటో షూట్ చేసేసింది. ఈ మధ్య కాలంలో బ్రైడల్ వేర్ లో వచ్చిన ఛేంజెస్ అన్నిటినీ ఒక్క కవర్ పేజ్ ఫోటోలోనే ప్రతిబింబింప చేసింది కేట్. అరమోడ్పు కన్నులతో చూపులు.. ముక్కుకు తగిలించిన పుడక.. కత్రినాకే కాదు.. ఈ ఫోటోకే అందాన్ని తెస్తుంటే.. అంతకు మించిన ఆకర్షణగా.. అమ్మడు పెట్టిన బొట్టిన అనిపిస్తుంది. ''హీట్ పెంచుతున్న కత్రినా కైఫ్'' అంటూ.. బ్రైడ్ మ్యాగజైన్ పెట్టిన ట్యాగ్ లైన్ కు పక్కాగా న్యాయం చేసేసింది కేట్. ఈ రేంజ్ లో అందాల మోత మోగించే బ్రైడల్ వేర్.. ఇప్పుడు తెగ ఫ్యాషన్ అయిపోయింది.