Begin typing your search above and press return to search.

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   23 July 2022 3:00 PM GMT
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్‌
X
బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ గత ఏడాది డిసెంబర్ లో యంగ్ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఫుల్‌ బిజీగా ఉన్న సమయంలో పెళ్లి పీఠలు ఎక్కిన కత్రీనా కైఫ్‌ కెరీర్‌ ను కంటిన్యూ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పారు. కాని తాజాగా బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కత్రీనా రెండేళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతుందట.

కత్రీనా తల్లి కాబోతుందని.. అందుకే రెండేళ్ల పాటు ఆమె సినిమాలకు దూరం ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు. కత్రీనా తల్లికాబోతున్న విషయం ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్‌ అవ్వలేదు. అలా అని మీడియ లో వస్తున్న వార్తలను కత్రీనా కానీ.. విక్కీ కౌశల్‌ కాని కొట్టి పారేయలేదు. కనుక కత్రీనా తల్లి కాబోతున్న వార్తలు నిజం అయి ఉంటాయని అంటున్నారు.

ఓవర్సీస్ క్రిటిక్‌ ఉమైన్‌ సందు ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం తో బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంతే కాకుండా బాలీవుడ్‌ మీడియాలో కూడా ఈ విషయం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. కత్రీనా తల్లికాబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె కొత్త సినిమాలకు కమిట్‌ అయ్యిందా అనే విషయాల గురించి కూడా చర్చ నడుస్తోంది.

కత్రీనా గత కొన్నాళ్లుగా కొత్త సినిమాలేమి చేయలేదు. అంతే కాకుండా ఇంతకు ముందు కమిట్‌ అయిన సినిమాలను స్పీడ్‌ గా చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కత్రీనా కైఫ్‌ చర్యలు.. మరియు ఆమె చుట్టు ఉన్న వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె గర్భవతి అనేది నిజమే అనిపిస్తుందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

విక్కీ కౌశల్‌ మరియు కత్రీనాలు ఈమద్య కాలంలో చాలా రొమాంటిక్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసిన విషయం తెల్సిందే. ఆ ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కత్రీనా తల్లికాబోతున్న వార్తలు సోషల్‌ మీడియాలో మరింతగా హాట్ టాపిక్ గా మారింది.