Begin typing your search above and press return to search.

నెట్టింట వైరల్ అవుతున్న కత్రినా డాన్స్ వీడియో..!!

By:  Tupaki Desk   |   15 Jan 2021 3:30 PM GMT
నెట్టింట వైరల్ అవుతున్న కత్రినా డాన్స్ వీడియో..!!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోతో తెగ ఆకట్టుకుంటోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కత్రినా డాన్స్ వీడియా మ్యూట్ లో పెట్టడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక కత్రినా డాన్స్ గురించి ఎవరికైనా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇదివరకే అగ్నిపథ్ సినిమాలోని చిక్నీ చమేలి, ధూమ్ 3 మూవీలోని కమ్లీ పాటలు చాలు కత్రినా డాన్స్ టాలెంట్ ప్రూవ్ చేయడానికి.. అయితే చాలకాలంగా కత్రినా అభిమానులు ఆమె డాన్స్ మిస్ అవుతున్నారట. అయితే అమ్మడు తాజాగా వీడియో పోస్ట్ చేసి కాస్త ఊపిచ్చిందని చెప్పవచ్చు. అయితే సాంగ్ మ్యూట్ లో ఎందుకు పెట్టిందనేది చర్చలకు దారితీస్తోంది. కానీ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. కత్రినా ప్రస్తుతం నటిస్తున్న 'ఫోన్ బూత్' మూవీలోని పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుంది. కొత్త సినిమా సాంగ్ కాబట్టి లీక్ చేస్తే బాగుండదని మ్యూట్ లో పెట్టిందట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కత్రినా నటించిన సూర్యవంశీ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అలాగే మరో సినిమా ఫోన్ బూత్ కోసం వర్కౌట్ చేస్తూ షూటింగ్ కి సన్నద్ధం అవుతుందని సమాచారం. ఇదిలా ఉండగా.. కత్రినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు ఈ భామ. సోషల్ మీడియాలో దాదాపు నాలుగున్నర కోట్ల ఫాలోయింగ్ కలిగిన కత్రినా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసికుందట ఈ స్టార్ బ్యూటీ. బ్లాక్ కలర్ అథ్లెటిక్ గ్రూవ్స్ ధరించి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో చిచ్చురేవుతోంది. ఇక తాజాగా ఈ భామ, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అందధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను డైరెక్టు చేయనున్నాడు.