Begin typing your search above and press return to search.

రీబాక్ తో జోడీ కట్టిన కత్రినా కైఫ్

By:  Tupaki Desk   |   3 July 2019 4:42 PM IST
రీబాక్ తో జోడీ కట్టిన కత్రినా కైఫ్
X
బాలీవుడ్ సెలబ్రిటీలు బ్రాండ్ అంబాజిడర్లుగా ఉండడం.. యాడ్స్ లో నటించడం అనేది అంత్యంత సాధారణ విషయం. ఆయితే ఈ సాధారణ విషయం కాస్తా దిశా పటాని అనే బ్యూటీ దెబ్బతో మారిపోయింది. బ్రాండ్ ప్రమోషన్ దశ దిశను మార్చిన బ్యూటీ దిశా పటాని. ఇప్పుడు ఈ ఇంట్రో ఎందుకంటే మరో కత్తి లాంటి బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రీబాక్ ఇండియా వారితో బ్రాండ్ ప్రమోషన్ అగ్రిమెంట్ సైన్ చేసింది.

ఈ విషయాన్ని ఒక చాకు లాంటి ఫోటో పోస్ట్ చేసి మరీ తెలిపింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే రేపు ఫ్యూచర్ లో ఎలా రెచ్చిపోతుందో అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన ఫోటోకు "రీబాక్ ఇండియా వారితో అసోసియేట్ అవుతున్నానని తెలిపేందుకు గర్విస్తున్నాను. నాకు ఇది పర్ఫెక్ట్ ఫిట్. నేను ఎలాంటి ఆలోచనలు చేస్తానో.. దేన్ని ఆచరిస్తానో రీబాక్ బ్రాండ్ వారు కూడా అలాగే చేస్తారు. ఫిట్నెస్ & డ్యాన్స్ నా జీవితంలో విడదీయరాని భాగం. అలాంటి విజన్ ను షేర్ చేసుకునే ఒక బ్రాండ్ తో ఇలా జట్టుకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఫిట్నెస్ కు సంబంధించిన విషయాల్లో పాలు పంచుకోవడం నాకు ఒక ఇంట్రెస్టింగ్ అవకాశం. మహిళల ఫిట్నెస్ ట్రైనింగ్.. బాడీ ఇమేజ్ లాంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. నా జీవితంలో ఇదో ముఖ్య భాగం.. రీబాక్ తో కలిసి అవన్నీ మీతో పంచుకునేందుకు గొప్పగా ఫీలవుతున్నాను" అంటూ పెద్ద మెసేజ్ పెట్టింది.

ఇక ఫోటో గురించి మాట్లాడుకుంటే.. బ్లాక్ కలర్ రీబాక్ స్పోర్ట్స్ టాప్.. బ్లాక్ కలర్ మినీ షార్ట్ ధరించి జిమ్ లో చెమటోడుస్తూ పోజిచ్చింది.. చెమటతో తడిసినట్టుగా అనిపించే లూజ్ హెయిర్.. పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న యాబ్స్.. రింగు లేకపోయినా లార్డ్ అఫ్ ది రింగ్స్ లా కనిపిస్తూ నెటిజన్లను మౌంట్ డూమ్ కు తీసుకుపోతున్న నాభి అందం అదరహో. ఫోటో తీసిన తరుణ్ విశ్వా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఈ ఫోటోలో లైటింగ్.. షేడ్స్ ప్రధాన ఆకర్షణ.

మరి పర్ఫెక్ట్ స్పోర్ట్స్ వేర్ ఫోటో షూట్స్ తో కత్రినా డీసెంట్ గా సరిపెడుతుందా.. లేదా దిశా పటానికే దిమ్మ తిరిగేలా రాబోయే రోజుల్లో అందాల విందు చేస్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా రీబాక్ - కత్రినా జోడీ మాత్రం డెడ్లీ కాంబినేషనే. నాట్ టు బి టేకెన్ లైట్లీ!