Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: అందాల బందిపోటు
By: Tupaki Desk | 21 Sept 2018 3:20 PM ISTఆమిర్ ఖాన్ సినిమాలు అంతే. మెల్లగా ప్రచారం మొదలవుతుంది. అది ఉప్పెనలా మారుతుంది. ఇక సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీసుకు సునామీ వచ్చినట్టే. ఇప్పుడు ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ప్రచారం అలానే మొదలయింది. సినిమాలోని ఒక్కో పాత్రకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న ఆమిర్ ఖాన్ ఇప్పుడు తాజాగా అందాల బందిపోటు గా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు.
ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ "సురయ్యా జాన్.. అందరికంటే అందమైన బందిపోటు. 'ధూమ్-3' సమయంలోనే నేను ఈమె పై నా మనసు పారేసుకున్నా.. కానీ చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఎవరైనా ఈ విషయం ఆమెకు చెప్తే నామీద దయచూపిన వారవుతారు." అంటూ ట్వీట్ లో చమత్కరించాడు. అయనకేం... ఎన్నైనా చెప్తాడు నిజంగా మనం అయన తరపునా వకాల్తా పుచ్చుకుంటే సల్లు భాయ్ ఊరుకుంటాడా.. వచ్చే ఈద్ తన కొత్త సినిమా రిలీజ్ అయ్యేదాకా మనల్ని కొట్టడమే అసలు పనిగా పెట్టుకుంటాడు. ఒకవేళ సినిమాలతో తీరిక లేకపోతే మిడ్ నైట్ కాల్స్ చేసి ఇలాంటి రాయబారాలకు దూరంగా ఉండమని మర్యాదగా హిందీ భాషలో చెబుతాడు.
ఈ చమత్కారాలు అందరికీ నచ్చవు కదా. సరే మళ్ళీ కత్రినా ఫస్ట్ లుక్ గురించే మాట్లాడుకుందామా. ఈ ఫస్ట్ లుక్ లో వెనక వెలుగుజిలుగులు.. ముందేమో సురయ్యా జాన్ డ్రెస్ కూడా మెరుస్తూ ఉంది. అందాలన్నీ బంగారుతో పోత పోసినట్టు పసిడి వన్నెల సుందరాంగిలా ఉంది.. కత్రినా కు యాక్టింగ్ రాదు అని ఊరికే మొత్తుకుంటారు కొంతమంది ఊరు పేరు లేని కమెడియన్స్.. అసలు ఇలాంటి అప్సరసకు యాక్టింగ్ అవసరమా..?