Begin typing your search above and press return to search.

కత్రీనా పెద్ద జోక్‌ వేసింది..!

By:  Tupaki Desk   |   21 Dec 2018 12:22 PM IST
కత్రీనా పెద్ద జోక్‌ వేసింది..!
X
బాలీవుడ్‌ లోని దాదాపు అందరు స్టార్‌ హీరోయిన్స్‌ ప్రేమాయణం సాగించిన వారే. అప్పుడు కాకుంటే ఇప్పుడు, ఇప్పుడు కాకుంటే అప్పుడు.. ఎప్పుడో ఒకప్పుడు అయితే స్టార్‌ హీరోయిన్స్‌ అంతా కూడా ప్రేమలో మునిగి తేలిన వారే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్స్‌ తోటి స్టార్స్‌ తో డేటింగ్స్‌- ఛాటింగ్స్‌ అనేవి చాలా కామన్‌. ఏ హీరోయిన్‌ అయినా ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించడం లేదు అంటే మాత్రం అదో పెద్ద జోకే. తాజాగా ఆ పెద్ద జోక్‌ ను కత్రీనా వేసింది.

తాజాగా ఈమె ‘జీరో’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా కత్రీనా కైఫ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను గత పదేళ్లలో ఎవరితో కూడా డేటింగ్‌ కు వెళ్లలేదంది. తనను ఎవరు డేటింగ్‌ కోసం గత పదేళ్లలో పిలవలేదంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో పక్కనే ఉన్న షారుఖ్‌ ఖాన్‌ స్పందిస్తూ నేను నిన్ను డిన్నర్‌ డేట్‌ కు తీసుకు వెళ్తానంటూ ఓదార్పుగా నవ్వుతూ అన్నాడు.

కత్రీనా పదేళ్లుగా డేట్‌ కు వెళ్లలేదంటూ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఆమె కెరీర్‌ ఆరంభం అయినప్పటి నుండి ఎవరితోనో ఒకరితో డేట్‌ లో ఉంటూనే ఉంది. కెరీర్‌ ఆరంభంలో సల్మాన్‌ ఖాన్‌ ను పీకలలోతు వరకు ప్రేమించింది. ఆయన కోసం జైలు వరకు కూడా వెళ్లింది. సల్మాన్‌ తో విడి పోయిన తర్వాత రణబీర్‌ కపూర్‌ తో ప్రేమలో పడినది. ఆయనతో చాలా దూరం వెళ్లింది. ఇద్దరి వ్యవహారం చాలా వరకు సాగింది. ఈమద్యే వీరు విడిపోయారు. మళ్లీ ఇప్పుడు అంబానీ కుటుంబంకు చెందిన వ్యక్తితో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతటి వ్యవహారాలు నడిపిన కత్రీనా కైఫ్‌ తనను పదేళ్లుగా ఎవరు డేటింగ్‌ కు తీసుకు వెళ్లలేదు అంటే నవ్వు రాక మరేం వస్తుంది మీరే చెప్పండి.