Begin typing your search above and press return to search.

కత్రీనా ఇండియాస్ ఫస్ట్‌ సూపర్ ఉమెన్

By:  Tupaki Desk   |   2 May 2022 5:30 AM GMT
కత్రీనా ఇండియాస్ ఫస్ట్‌ సూపర్ ఉమెన్
X
హాలీవుడ్‌ స్క్రీన్‌ పై ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌ మ్యాన్‌ సినిమాలు వచ్చాయి. సుదీర్ఘ కాలంగా హాలీవుడ్‌ లో సూపర్ మ్యాన్ సినిమాలు వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బాలీవుడ్‌ లో కూడా సూపర్‌ మ్యాన్‌ తరహా సినిమాలు వస్తున్నాయి. కాని సూపర్‌ ఉమెన్ సినిమా లు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈమద్య కాలంలో హాలీవుడ్‌ లో సూపర్‌ ఉమెన్ సినిమాలు వస్తూ ఉన్నాయి.

ఇండియాలో కూడా కొన్ని సూపర్ ఉమెన్ సినిమాలు అని తెరకెక్కించారు కాని అవి ఆ స్థాయి లో లేవు. సూపర్‌ మ్యాన్ సినిమా ల స్థాయిలో ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్‌ స్క్రీన్‌ పై సూపర్ ఉమెన్ సినిమాలు రాలేదు.

ఎట్టకేలకు కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా ఒక సూపర్‌ ఉమెన్ సినిమా ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ ఏడాది చివర్లో కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా అలీ అబ్బాస్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ సినిమా ప్రారంభం కాబోతుంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్ గా కత్రీనా కైఫ్ ఎన్నో యాక్షన్ పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. అందుకే ఈ సూపర్ ఉమెన్ పాత్రకు ఆమె సరిగ్గా సూట్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు.

సూపర్ ఉమెన్ సినిమా లు చాలా రిస్క్ తో కూడుకున్నవి. హీరోయిన్స్ ఇలాంటి సినిమాలకు ఆసక్తి చూపడం లేదు. కాని కత్రీనా కైఫ్ మాత్రం తనకు యాక్షన్ సన్నివేశాలపై ఆసక్తితో ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. సూపర్‌ ఉమెన్ పాత్రలో కత్రీనా కైఫ్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కత్రీనాతో ఈ సినిమా గత ఏడాది ప్రారంభించాల్సి ఉన్నా ఆమె ఇతర సినిమాలు.. పెళ్లి కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇంకా ఇతర సినిమాలో బిజీగానే ఉంది. కనుక ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందట. ఈ సూపర్‌ ఉమెన్‌ సినిమాకు 'సూపర్ సోల్జర్‌' అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట.