Begin typing your search above and press return to search.

కార్తీకి ఏ క‌థా తెలియ‌ద‌ట‌!!

By:  Tupaki Desk   |   13 April 2018 11:30 PM GMT
కార్తీకి ఏ క‌థా తెలియ‌ద‌ట‌!!
X
‘యుగానికి ఒక్క‌డు’- ‘ఆవారా’- ‘నా పేరు శివ‌’ సినిమాల‌తో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సూర్య త‌మ్ముడు కార్తీ. నాగార్జున‌తో కలిసి ఆయ‌న న‌టించిన ‘ఊపిరి’ సినిమాకీ క‌లెక్ష‌న్లు బాగానే వ‌చ్చాయి. ఇప్పుడు శ్రీ‌విష్ణు ‘నీది నాది ఒకే క‌థ‌’ ఫేం వేణు ఉడుగుల ద‌ర్శ‌కత్వంలో కార్తీ ఓ ద్విభాషా చిత్రం చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే అవ‌న్నీరూమ‌ర్లేన‌ని కొట్టేశాడు కార్తీ.

తెలుగులో ఈ మ‌ధ్య విడుద‌లైన ‘ఖాకీ’ కూడా తెలుగులో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. అలాగే వేణు ఉడుగుల ఓ విభిన్న‌మైన కాన్సెప్ట్ తో సినిమా తీసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వేణు ఉడుగుల త‌మిళ స్టార్ హీరో కార్తీతో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌నీ... త‌మిళ‌- తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమా క‌థ‌ను ఇప్ప‌టికీ కార్తీని క‌లిసి వినిపించాడ‌ని త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌డ‌మే త‌రువాయి... అని వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన కార్తీ తాను ఏ ద్విభాషా చిత్రం ఒప్పుకోలేద‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం తాను త‌మిళంలో ‘క‌డైకుట్టి సింగం’ సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాడ‌ట‌.

స‌యేషా హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ సినిమా త‌మిళ‌నాడులో కొన‌సాగుతున్న స‌మ్మె కార‌ణంగా వాయిదా ప‌డింది. స‌మ్మె ఎప్పుడు ఆగితే... అప్పుడు షూటింగ్ మొద‌లెట్టి వీలైనంత త్వ‌ర‌గా థియేట‌ర్లలోకి తేవాల‌ని అనుకుంటున్నాడు కార్తీ. ఈ సినిమాలో ప‌ల్లెటూరి రైతు పాత్ర‌లో మీస‌కట్టుతో క‌నిపిస్తున్నాడు కార్తీ. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న ఈ సినిమా తెలుగులో చిన‌బాబు పేరుతో విడుద‌ల కానుంది.