Begin typing your search above and press return to search.

కత్తి గురి త్రివిక్రమ్ పైకి వెళ్ళిందే

By:  Tupaki Desk   |   3 Jan 2018 11:25 AM GMT
కత్తి గురి త్రివిక్రమ్ పైకి వెళ్ళిందే
X
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, టీవీ డిబేట్స్ లో విస్తృతంగా కనిపిస్తున్న దర్శకుడు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన టార్గెట్ ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పైకి మళ్ళించాడు. సాధారణంగా జనసేన విధానాల గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఎక్కువగా ప్రశ్నలు సంధించే కత్తి మహేష్ తాజాగా త్రివిక్రమ్ ను సబ్జెక్టుగా తీసుకున్నాడు. తన పోస్ట్ లో త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఏదో ఒక సినిమా నుంచి స్ఫూర్తి పొంది సీన్లు - ఎపిసోడ్లు తన క్రియేటివిటీ తో మార్చి తీసే ఇలాంటి దర్శకులు ఉండటం ఖర్మన్న కత్తి మహేష్ ఆ మాత్రం రాసే రచయితలు లేకపోవడం వల్లే ఇలాంటి స్థితి వచ్చిందని చెప్పడం కొసమెరుపు. అజ్ఞాతవాసి విడుదల మరో ఆరు రోజుల్లో ఉన్న నేపధ్యంలో కత్తి మహేష్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

కత్తి మహేష్ ఏ పోస్ట్ చేసినా దానికి మద్దతు ఎక్కువగా దక్కించుకునే క్రమంలో ఈ సారి మాత్రం కొద్దిగా గురి తప్పి దీని గురించి విమర్శలు కూడా అందుకున్నాడు. కత్తి మహేష్ అన్నదాంట్లో కొంతమేర నిజం ఉన్నప్పటికీ ఇలా ఘాటైన పదాలు ఉపయోగించి ఉండకూడదని కొందరు కామెంట్స్ లో తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. త్రివిక్రమ్ స్ఫూర్తి పొందటం అనేది పక్కన పెడితే టాలీవుడ్ స్టామినా పెంచిన హిట్ మూవీస్ ఇచ్చాడు అనేది మాత్రం నిజం. ఒకవేళ అభిప్రాయాన్ని వ్యక్త పరచాలి అనుకున్నప్పుడు కొంత సున్నితంగా చెబితే సరిపోయేది కదా అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. దీని గురించి మళ్ళి కత్తి మహేష్ తర్వాత మళ్ళి స్పందించలేదు కాని త్రివిక్రమ్ గురించిన కామెంట్స్ మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ని ఎవరు డైరెక్ట్ గా ఇలా కామెంట్ చేయలేదు మరి.