Begin typing your search above and press return to search.

జ‌బ‌ర్ద‌స్త్‌ ను ఏసుకున్న క‌త్తి

By:  Tupaki Desk   |   13 Nov 2017 4:06 AM GMT
జ‌బ‌ర్ద‌స్త్‌ ను ఏసుకున్న క‌త్తి
X
తిట్టేవాళ్లు తిడుతున్నా.. చూసేవాళ్లు చూస్తూనే ఉండే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జ‌బ‌ర్ద‌స్త్ షోగా చెప్పాలి. తెలుగు టీవీలో టెలికాస్ట్ అయ్యే కార్య‌క్ర‌మాల్లో విప‌రీత‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉండి.. అంతే విప‌రీతంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తే షో ఏదైనా ఉందంటే అది జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంగా చెప్పాలి.

తాజా ఎపిసోడ్ ల‌లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది వేసిన సెటైర్ల‌పై సినీ విమ‌ర్శ‌కుడు క‌మ్ బిగ్ బాస్ ఫేం మ‌హేశ్ క‌త్తి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డాడు. ఆది స్కిట్ లో భాగంగా పెళ్లి అనేది మ‌నం సినిమా తీసినంత క‌ష్టం కానీ ప్రేమ మాత్రం.. ముందు పొట్ట వేసుకొని వెనుక బ‌ట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అంటూ పంచ్ లు వేసేశాడు.

ఈ పంచ్ లు త‌న‌ను ఉద్దేశించి ఉన్నాయంటూ క‌నెక్ట్ అయ్యాడ క‌త్తి. త‌న‌కు పొట్ట ఉంద‌ని.. బ‌ట్ట ఉంద‌ని.. మ‌నుషులంతా ఒక్క‌టేలా ఉంటారా? అంటూ క్వ‌శ్చ‌న్ వేయ‌ట‌మే కాదు.. ఒక్కొక్క‌రు ఒక్కోలా ఉంటార‌ని.. ఆ ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ఉండ‌ట‌మే ప్ర‌పంచ‌మ‌న్నారు. కాస్త భిన్నంగా ఉంటేనే జోర్స్ అయిపోతామా? అంటూ రియాక్ట్ అయిన మ‌హేశ్‌.. ఒక‌రు పొడుగ్గా ఉండొచ్చ‌ని.. మ‌రొక‌రు పొట్టిగా ఉండొచ్చ‌ని.. నా స్టైల్లో నేను ఉంటానని.. అంత మాత్రానికే అలా అనేస్తారా? అంటూ సోష‌ల్ మీడియా లైవ్ ద్వారా హైప‌ర్ ఆదిని ఏసుకున్నాడు.

ఇంత చెప్పిన మ‌హేశ్ క‌త్తి.. తాను జ‌బ‌ర్ద‌స్త్ షోను చూడ‌న‌ని.. కాకుంటే ఫ్రెండ్స్ పంపే లింక్స్ చూడ‌టంతోనే త‌న‌కీ విష‌యాలు తెలిశాయ‌న్నారు. జ‌బ‌ర్ద‌స్త్ గొప్ప షో అయినా.. అందులో గొప్ప కామెడీ ఉంటుంద‌ని తాను అనుకోన‌న్నారు. మ‌నుషుల మీదా..వారు వేసుకునే బ‌ట్ట‌ల మీద కామెడీ చేస్తూ అప‌హాస్యం చేస్తున్న దానిని హాస్యంగా ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిప‌డ్డాడు. షో చూడ‌నంటూనే.. షో లింకులు చూస్తాన‌ని చెప్ప‌టం ఏల క‌త్తి?