Begin typing your search above and press return to search.

మ‌హేష్ పై వేణుమాధ‌వ్ షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:15 AM GMT
మ‌హేష్ పై వేణుమాధ‌వ్ షాకింగ్ కామెంట్స్!
X
తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పవన్ కల్యాణ్ - పూనమ్ కౌర్ ల‌ పై కత్తి మహేశ్ సంచ‌ల‌న‌ ఆరోపణలు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. పూన‌మ్ కు ఆరు ప్ర‌శ్న‌లు సంధించిన మ‌హేష్ ....వాటికి స‌మాధాన‌మివ్వాల‌ని స‌వాల్ విసిరారు. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌న్నింటికీ త‌న వద్ద ఆధారాలున్నాయ‌ని తెలిపారు. ప్రెస్ మీట్ అనంత‌రం ఓ ప్ర‌ముఖ టీవీ చానెల్ నిర్వహించిన లైవ్ షోలో మ‌హేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఫోన్ లైన్లో మాట్లాడిన క‌మెడియ‌న్ వేణు మాధ‌వ్ - మ‌హేష్‌ ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిది. యాంకర్ సత్యకు త‌న‌కు ప‌రిచయం ఉంద‌ని , కాబ‌ట్టి ఆయ‌న‌తోనే మాట్లాడతానని - పెద్దవాళ్లు - అంకుల్స్ తో తాను మాట్లాడనంటూ మహేష్ ను ఉద్దేశించి వేణుమాధవ్ సెటైర్లు వేశారు.

పవన్ - జనసేన అభిమానులందరూ లైవ్ లో మాట్లాడవ‌ద్ద‌ని ఆయ‌న రిక్వెస్ట్ చేశారు.‘మా’ సభ్యురాలు పూనమ్ కౌర్ పై సంచ‌ల‌న ఆరోపణలు చేసిన మహేష్‌ పై చర్యలు తీసుకుంటామ‌ని వేణు మాధవ్ అన్నారు. తాను పెద్ద‌త‌ను గౌర‌విస్తాన‌ని, ఆ అంకుల్ (మ‌హేష్‌) ని గౌరవించాల్సిన బాధ్యత త‌నకుంద‌ని చ‌మ‌త్క‌రించారు. కత్తి మహేష్ కు ఆరోగ్యం పాడై ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను పూనమ్ కౌర్ గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాన‌ని, మా అసోషియేషన్ త‌న‌ను పిలిస్తే ఆ ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు కావాలని చెబుతాన‌ని మ‌హేష్ అన్నారు. అదే స‌మ‌యంలో పూన‌మ్ ను కూడా పిలిచి నిజానిజాలు తెలుసుకోవాల‌ని, తాను చెప్పింది నిజం కాకపోతే త‌న మీద చర్యలు తీసుకున్నా ప‌ర్లేద‌ని చెప్పారు. పూనమ్ కౌర్ ‘మా’ అసోసియేషన్ లేదా కోర్టుకెళ్లినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.