Begin typing your search above and press return to search.

ముమైత్ ఉగాది ప‌చ్చ‌డ‌ట‌!

By:  Tupaki Desk   |   29 Aug 2017 5:01 PM GMT
ముమైత్ ఉగాది ప‌చ్చ‌డ‌ట‌!
X
మొద‌ట్లో పెద్ద‌గా క్రేజ్ రాని బిగ్ బాస్ షోకు రాను రాను క్రేజ్ పెరిగింది. షో ప్రారంభ‌మైన కొత్త‌లో వీకెండ్ లో ఎన్టీఆర్ వ‌చ్చిన‌పుడు మాత్ర‌మే టీఆర్పీలు వ‌చ్చేవి. క్ర‌మ క్ర‌మంగా ఆ షోలో ఎలిమినేష‌న్ లు - కాంట్ర‌వ‌ర్సీలు పెర‌గ‌డంతో అమాంతం ఆ షో క్రేజ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు ఆ షోలో స‌భ్యుల‌పై త‌మ అభిప్రాయాల‌ను వెళ్ల‌గ‌క్కేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు సైలెంట్ గా ఉండి బ‌య‌ట‌కు రాగానే త‌మ హౌస్ మేట్స్ పై విమ‌ర్శ‌లు గుప్పించేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం షో నుంచి ఎలిమినేట్ అయిన యాంక‌ర్‌ క‌త్తి కార్తీక అదే త‌ర‌హాలో ముమైత్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ముమైత్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేద‌ని చెప్పింది కార్తీక‌. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ముమైత్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

ముమైత్ ఖాన్ కొంచెం కాంప్లికేటెడ్ ప‌ర్స‌న్ అని కత్తి కార్తీక అంది. ‘ మున్నూ (ముమైత్ ఖాన్) కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే, ఆమెకు అన్నీ ఎక్కువే.. ప్రేమ - కోపం అన్నీ ఎక్కువే. ఆమెకు కోపం వస్తే తట్టుకోలేం. ‘ఇలా తిట్టద్దు’ అని నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. ఆ తర్వాత అలా ఎందుకు తిట్టానంటూ ముమైత్ బాధపడేది. ఏం లాభం? షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్.ముమైత్ కు ఉగాది పచ్చడి అని పేరు పెట్టా. ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అలాగే, ముమైత్ లో కూడా ప్రేమ, కోపం...అన్నీ ఉన్నాయి’ అని కార్తీక త‌న బెస్ట్‌ ఫ్రెండ్ గురించి చెప్పింది. మొత్తానికి ఈ బిగ్ బాస్ షో పూర్త‌యే స‌రికి ఎంత‌మంది ఆప్త మిత్రుల‌వుతారో, మ‌రెంత‌మంది బ‌ద్ధ శ‌త్రువుల‌వుతారో వేచి చూడాలి.