Begin typing your search above and press return to search.

పెన్ష‌న్‌ తో బ‌తికేస్తున్న స్టార్‌ హీరో భార్య‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 6:19 PM GMT
పెన్ష‌న్‌ తో బ‌తికేస్తున్న స్టార్‌ హీరో భార్య‌
X
బ‌యోపిక్‌ ల వెల్లువ‌లో ప్ర‌ముఖ‌ సెల‌బ్రిటీల జీవితాలు వెండితెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌ - వైయ‌స్సార్‌ - కేసీఆర్ బ‌యోపిక్‌ లు సెట్స్‌పై ఉన్నాయి. ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు - మ‌హానాయ‌కుడు - యాత్ర‌ - ఉద్య‌మ సింహం - తెలంగాణ దేవుడు అంటూ వ‌రుస‌గా బాయోపిక్‌ లు లొకేష‌న్‌ లో ఉన్నాయి. ఇందులో ఉద్య‌మ‌సింహం - తెలంగాణ దేవుడు కేసీఆర్‌ పై తీస్తున్న సినిమాలు.

వీటితో పాటు ఈ స్పీడ్‌ లో క‌త్తి కాంతారావు బ‌యోపిక్ సెట్స్‌ పైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు పీసీ ఆదిత్య ఈ బ‌యోపిక్‌ ని తెర‌కెక్కిస్తున్నారు. అందుకోసం ఆయ‌న కాంతారావు సొంత ఊరు వెళ్లి మ‌రీ బోలెడంత రీసెర్చ్ చేశారు. త్వ‌ర‌లోనే ఆడియో వేడుక‌కు కాంతారావు బ‌యోపిక్ `రాకుమారుడు` రెడీ అవుతోందని తెలుస్తోంది. కాంతారావు జీవిత చ‌ర‌మాంకంలో ఆయ‌న ఎదుర్కొన్న క‌ష్టాలు ఓ గుణ‌పాఠం అని తెలిపారు ద‌ర్శ‌కుడు. ప‌రిశోధ‌న‌లో ఆయ‌న వ్య‌క్తిత్వం గురించి తెలిశాక ఒక గొప్ప వ్య‌క్తి జీవితాన్ని తెర‌కెక్కించ‌డం ఆనందాన్నిస్తోంద‌ని అన్నారు. మొన్న కాంతారావు జ‌యంతి రోజున కాంతారావు ముఖ‌చిత్రం తో పోస్ట‌ల్ స్టాంప్‌ ని రిలీజ్ చేసింది త‌పాలా శాఖ‌.

కాంతారావు బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న వేళ ఆయ‌న‌ ఫ్యామిలీ గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి. కాంతారావు కొడుకు రాజా త‌న త‌ల్లి గారైన‌ హైమావ‌తితో క‌లిసి హైద‌రాబాద్‌ లోనే నివాసం ఉంటున్నారు. అయితే రాజా చ‌దువుకోలేదు.. ఉద్యగం కూడా చేయ‌లేని ప‌రిస్థితి. తెలంగాణ ప్ర‌భుత్వం 10,000 పెన్ష‌న్ ఈ కుటుంబానికి ఇస్తోంది. అందులో రూ.6000 వ‌ర‌కూ ఇంటికి అద్దె క‌డుతుంటారు. మిగ‌తా డ‌బ్బు తోనే కాలం గ‌డ‌వాలి. కాంతారావుకు ముగ్గురు కొడుకులు కూతురు. పెద్ద కొడుకు ప్ర‌తాప్ ఆస్ట్రేలియాలో స్థిర‌ప‌డిపోయారు. ఆయ‌న ఇల్ల‌రికం ఉంటున్నారు. కూతురు సుశీల హైద‌రాబాద్‌ లోనే నివాసం ఉంటున్నారు. ఎవ‌రి జీవితం వారిది. ఎవ‌రి క‌ష్టాలు వారివి. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ ల‌కు ధీటైన హీరో కాంతారావు. కానీ అత‌డి ఫ్యామిలీ సినీరంగంలో నిల‌వ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం వృద్ధురాలైన కాంతారావు స‌తీమ‌ణి- కుమారుడు రాజా పెన్ష‌న్‌ పైనే కాలం వెల్ల‌దీస్తున్నారు.