Begin typing your search above and press return to search.

కత్తి కాంతారావు 'రాజకుమారుడు'

By:  Tupaki Desk   |   12 Nov 2018 3:59 PM IST
కత్తి కాంతారావు రాజకుమారుడు
X
తెలుగు సినిమా పరిశ్రమతో పాటు పలు భాషల్లో కూడా ఈమద్య బయోపిక్‌ లు చాలా కామన్‌ అయ్యాయి. బయోపిక్‌ లు వరుసగా తెరకెక్కుతున్న ఈ సమయంలోనే కత్తి కాంతారావు జీవిత చరిత్రను కూడా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాత పీసీ ఆధిత్య ఏర్పాట్లు చేస్తున్నారు. కత్తి కాంతారావుతో దాదాపు 25 సంవత్సరాల అనుబంధం ఉన్న పీసీ ఆధిత్య ఈ చిత్రంను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. పది సినిమాలకు దర్శకత్వం వహించిన పీసీ ఆధిత్య ఆమద్య 100 రోజుల్లో 100 షార్ట్‌ ఫిల్మ్‌ తీసి రికార్డు సృష్టించారు. కత్తి కాంతారావు రాసుకున్న ఆత్మ కథ ఆధారంగా తాను ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా పీసీ ఆధిత్య పేర్కొన్నారు.

పీసీ ఆధిత్య ఈ బయోపిక్‌ గురించి మాట్లాడుతూ... మహానటి చిత్రం చూసిన సమయంలో తనకు ఈ చిత్రాన్ని చేయాలనే ఆలోచన వచ్చింది. ఎన్టీఆర్‌ - సావిత్రి - జయలలిత లకు సమకాలీకుడు అయిన కత్తి కాంతారావు గారి గురించి ఈతరం ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని మొదలు పెడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కాంతారావు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయన చనిపోయేంత వరకు ఈ బయోపిక్‌ సాగుతుంది. ఈ బయోపిక్‌ లో ఎన్టీఆర్‌ - ఏయన్నార్‌ ఇంకా ప్రముఖ తెలుగు తారల పాత్రలు ఉండబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ చిత్రానికి ‘రాజకుమారుడు’ అనే టైటిల్‌ ను నిర్ణయించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈనెల 16న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించి, మార్చి 22న కత్తి కాంతారావు గారి వర్థంతి సందర్బంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.