Begin typing your search above and press return to search.

మహానాయకుడు వారికి ఊరటనిస్తాడట!

By:  Tupaki Desk   |   14 Jan 2019 5:08 AM GMT
మహానాయకుడు వారికి ఊరటనిస్తాడట!
X
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న భారీ అంచనాల నడుమ విడుదలయింది. రివ్యూస్ రేటింగ్స్.. మౌత్ టాక్ అన్నీ బాగున్నాయి కానీ సినిమా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరలకు అమ్మడంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా లేవు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ టీం వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారట.

రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొదటి భాగం రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకే ఇస్తున్నారట. రెండో భాగం హక్కులకు గానూ వారి నుండి ఒక్కరూపాయ కూడా తీసుకోవడం లేదని సమాచారం. దీంతో వారికి మొదటి భాగం ద్వారా జరిగిన నష్టాలను కవర్ చేసుకునే అవకాశం లభించింది.

మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు క్రిష్ రెండో భాగం 'మహానాయకుడు' లో ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణాన్ని.. అందులో ఒడిదుడుకులను చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సెకండ్ పార్ట్ కు సంబంధించిన మిగిలి ఉన్న షూటింగ్ జోరుగా సాగుతోంది.